Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-video7faa53e9-fe3e-4d85-9fac-73b7d5c17674-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-video7faa53e9-fe3e-4d85-9fac-73b7d5c17674-415x250-IndiaHerald.jpgవెర్రి చేష్టలు చేస్తే మనుషులకేంటి.. జంతువులకు, పక్షులకు కూడా కోపం వస్తుంది. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోనే దీనికి ఉదాహరణ. ఇందులో ఓ వ్యక్తి చేసిన పనికి గాల్లో ఎగురుతున్న పక్షులకు కోపం వచ్చింది. వాటిలో ఒ పక్షి అతడికి ఊహించని పనిష్మెంట్ ఇచ్చింది. దాంతో అతడికి దిమ్మతిరిగిపోయింది. అయితే అతడి పరిస్థితి..viral video;manu;tiru;audi;twitter;thikkaపక్షయినా సరే.. రెచ్చగొడితే పనిష్మెంట్ ఇలానే ఉంటుంది.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరుపక్షయినా సరే.. రెచ్చగొడితే పనిష్మెంట్ ఇలానే ఉంటుంది.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరుviral video;manu;tiru;audi;twitter;thikkaFri, 09 Apr 2021 18:01:07 GMTఇంటర్నెట్ డెస్క్: వెర్రి చేష్టలు చేస్తే మనుషులకేంటి.. జంతువులకు, పక్షులకు కూడా కోపం వస్తుంది. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోనే దీనికి ఉదాహరణ. ఇందులో ఓ వ్యక్తి చేసిన పనికి గాల్లో ఎగురుతున్న పక్షులకు కోపం వచ్చింది. వాటిలో ఒ పక్షి అతడికి ఊహించని పనిష్మెంట్ ఇచ్చింది. దాంతో అతడికి దిమ్మతిరిగిపోయింది. అయితే అతడి పరిస్థితి ఎలా ఉన్నా.. దీనిని చూసిన వారికి మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వోస్తుంది. ఇంతకీ అతడేం చేశాడు..? పక్షి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి..? అనేది తెలియాలంటే ఈ వార్త చదవండి. చివర్లో చక్కగా వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

పక్షులు, జంతువుల వంటి మూగ జీవాలకు అనేకమంది ఆహారం అందిస్తుంటారు. ప్రధానంగా ఎండాకాలంలో చాలా మంది తమ ఇళ్లల్లో పక్షులు తాగేందుకు నీటిని ఏర్పాటు చేస్తుంటారు. దానికోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను కూడా సిద్ధం చేస్తుంటారు. అయితే, కొందరు మాత్రం వెరైటీగా ఇలాంటి పనులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. మూగజీవాలకు ఆశ చూపి.. ఆడుకోవాలని అనుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి కొంటెపనితోనే పక్షులను ఆడించబోయాడు.

సముద్రం ఒడ్డున ఓ వ్యక్తి పక్షులకు ఆహారం వేసే ప్రయత్నం చేశాడు. అందరిలా కాకుండా కొత్తగా ట్రై చెయ్యబోయాడు. ఆ వ్యక్తి చిన్న ఆహార పదార్థాన్ని తన నోటితో పట్టుకుని పక్షులను ఆహ్వానించాడు. అయితే అతడి ముఖం నచ్చలేదో, అతడు చేస్తున్న పని నచ్చలేదో అక్కడ తిరుగుతున్న పక్షుల్లో ఓ పక్షి అతడి ముఖంపై చారెడు రెట్ట వేసి వెళ్లిపోయింది. దీంతో తన ప్రయత్నం బెడిసికొట్టడంతో పాటు ముఖం పాడైపోవడంతో తెగ బాధపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ తంతునంతా వీడియో తీసిన మరో వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. కడుపుబ్బా నవ్విస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సదరు వ్యక్తికి తిక్క కుదిరిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇది ఫేక్ వీడియో అంటూ కొట్టిపారేస్తున్నారు. అతడి ముఖంపై పక్షి రెట్ట వేయలేదని, పక్క వ్యక్తే ఏదో వేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 50 లక్షల మందికిపైగా నెటిజన్లు తిలకించారు. మరి మీరూ ఓ లుక్కేసి నవ్వుకోండి.

" style="height: 370px;">







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"వకీల్ సాబ్" పై సుకుమార్ ప్రశంశలు..!

"వకీల్ సాబ్ " సినిమా పై అనిల్ రావిపూడి కామెంట్స్..!!

వ‌కీల్‌సాబ్ అంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు!

వకీల్ సాబ్ పై వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వకీల్ సాబ్ : బాలీవుడ్ సినిమాల రికార్డులు బద్దలే ?

'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

పుష్ప సినిమా బడ్జెట్, పారితోషకాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>