PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-latest-news3bb25492-07b3-4923-9ae1-a6f46b9cf342-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-latest-news3bb25492-07b3-4923-9ae1-a6f46b9cf342-415x250-IndiaHerald.jpg మహారాష్ట్రలో కరోనా మ‌ర‌ణ మృదంగాన్ని మోగిస్తోంది. గ‌త సంవ‌త్సరాన్ని మించి ఈసారి మ‌రిన్ని కేసులు న‌మోద‌వుతున్నాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరణాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొర‌క‌డంలేదు. నాగ్‌పూర్‌లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరేందుకు బెడ్లు దొరక్క పొరుగు రాష్ట్రాల‌కు వెళుతున్నారు. బెడ్ దొర‌క్క ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చిన కోవిడ్ బాధితుడిని వరంగల్ ఆదుకుందcorona, latest news;rana;abhishek;warangal;doctor;oxygenనేనున్నానంటూ... మ‌హారాష్ట్ర‌ను ఆదుకున్న తెలంగాణ‌నేనున్నానంటూ... మ‌హారాష్ట్ర‌ను ఆదుకున్న తెలంగాణ‌corona, latest news;rana;abhishek;warangal;doctor;oxygenFri, 09 Apr 2021 20:25:13 GMT
మహారాష్ట్రలో కరోనా మ‌ర‌ణ మృదంగాన్ని మోగిస్తోంది. గ‌త సంవ‌త్సరాన్ని మించి ఈసారి మ‌రిన్ని కేసులు న‌మోద‌వుతున్నాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరణాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొర‌క‌డంలేదు. నాగ్‌పూర్‌లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరేందుకు బెడ్లు దొరక్క పొరుగు రాష్ట్రాల‌కు వెళుతున్నారు. బెడ్ దొర‌క్క ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చిన కోవిడ్ బాధితుడిని వరంగల్ ఆదుకుంది.

వ‌రంగ‌ల్‌లో చికిత్స‌
నాగ్‌పూర్‌లోని న్యూబిడిపేట్‌కి చెందిన కూరగాయాల వ్యాపారికి కోవిడ్ సోకింది. క్రమంగా ఆయన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో శ్వాస తీసుకోవ‌డంలోను ఇబ్బంది ఎదురైంది. బుధవారం అర్ధరాత్రి ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడి ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో లేవు. ఆ రోజు ఉదయం నుంచే నగరంలోని కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. వెంటనే ఆ వ్యాపారిని చికిత్స కోసం తెలంగాణకు తీసుకొచ్చారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వెంటనే ఐసీయూలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు.

అర్థ‌రాత్రి రెండు గంట‌ల‌కు బ‌య‌లుదేరి
నాగ్‌పూర్‌లోని ప్ర‌భుత్వాస్ప‌త్రులు, బోధనాస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో వీఐపీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఎవ‌రికీ బెడ్లు దొర‌క‌డంలేదు. అర్థ‌రాత్రి రెండుగంట‌ల స‌మ‌యంలో ఆ వ్యాపారిని వ‌రంగ‌ల్ తీసుకువెళ్ల‌మ‌ని అక్క‌డి వైద్యులు చెప్పారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్‌లో మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు వాళ్లు వ‌రంగ‌ల్ చేరుకున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క అంబులెన్సుల్లోనే ఉండిపోయి కనీసం ఐదుగురు కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారని అంబులెన్స్‌ల నిర్వహణ సంస్థ యజమాని డాక్టర్ అభిషేక్ రానా తెలిపారు. మ‌హారాష్ట్ర‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉధృతికి ఈ ప‌రిస్థితి అద్దం ప‌డుతోంద‌న్నారు. మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితి రోజురోజుకూ అదుపు త‌ప్పుతుండ‌టంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌వ్వాల‌ని సూచించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ డైలాగులు జనసేనకు రిలేటెడ్ గా ఉన్నాయంటే సంతోషమే : వేణు శ్రీరామ్

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>