QuotesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/ekadashi-44c04f3f-b085-4070-8cf9-6984dde0c1d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/ekadashi-44c04f3f-b085-4070-8cf9-6984dde0c1d7-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాము.. అంతేకాకుండా సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన జ్ఞానం రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అలాగే అన్నీ సాంప్రదాయాల పైన కూడా మనకు ఒక పట్టు ఉండాలి .అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము EKADASHI;vedhika;vishnu;india;vమంచిమాట : సాధారణంగా ఏకాదశి కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు..?మంచిమాట : సాధారణంగా ఏకాదశి కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు..?EKADASHI;vedhika;vishnu;india;vThu, 08 Apr 2021 06:00:00 GMT
ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అంతేకాకుండా సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన జ్ఞానం రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అలాగే అన్నీ సాంప్రదాయాల పైన కూడా మనకు ఒక పట్టు ఉండాలి .అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. అయితే ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ,  మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..సాధారణంగా ఏకాదశి కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు..?

మన సంప్రదాయంలో ఏకాదశి తిధికి చాలా ప్రాముఖ్యత ఉంది. సంవత్సరంలో వచ్చే 12 ఏకాదశులు, అలాగే ఆ పై ఒక్కొక్కసారి అధిక మాసం వస్తుంది. దానితో రెండు ఏకాదశులు కలుపుకుని, మొత్తం 14 ఏకాదశులు,ఈ మొత్తం ఏకాదశి లన్నింటికి, ఒక్కో ఏకాదశి కి ఒక్కో పేరు చొప్పున ఒక్కో ప్రాధాన్యత ఉంది . ఏకాదశిలన్ని  మన సాంప్రదాయం ప్రకారం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అటు విష్ణువుని పూజించేవారికి, ఇటు పరమశివుని పూజించేవారికి ఏకాదశి అత్యంత ప్రాధానమైన తిధి గా చెప్పబడుతుంది. సాధారణంగా మనలో చాలా మంది ఏకాదశి అనగానే అటు రుద్రాభిషేకాలు, ఇటు విష్ణు సహస్ర పారాయణాలు చేస్తూనే ఉపవాసాలు ఉండటం సంప్రదాయంగా వస్తున్న పద్ధతి.

అయితే ఎందుకు ఏకాదశికి ఇంత ప్రాధాన్యం ఉంది అంటే..? ఏకాదశి అనగానే 11 లక్షణాలు కలిగిన టువంటిది. అలాగే 11 పెత్తనాలు కలిగినటువంటిది అని అర్థం. ఏమిటా పదకొండు అంటే అయిదు జ్ఞానేంద్రియాలు,  అయిదు కర్మేంద్రియాలు. వీటిని నడిపించేటటువంటి మనసు. జ్ఞానేంద్రియాలు అంటే అందరికీ తెలిసినవే కన్ను, ముక్కు, చెవి, నోరు అలాగే చర్మం. ఇక  కర్మేంద్రియాలు అంటే కాళ్లు,చేతులు,విసర్జక అవయవాలు,శరీరావయవాలు ఇవి. అయితే వీటన్నింటినీ అదుపులో ఉంచేది మాత్రం మనసు మాత్రమే. అయితే ఈ పదకొండు ఒకే ముఖంగా ఉండి, ఏకోన్ముఖంగా ఉండి పని చేయడానికి అనుకూలంగా ఉండే రోజునే మనం ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అలాగే మనసు కూడా నిర్ధిష్టంగా ఉంటాయి. అందుకే ఏకాదశి కి అందరూ అంత ప్రాధాన్యతను ఇస్తారు.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో వ‌రుస ఎన్నిక‌లు

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>