PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-latest-newsa374619b-64a4-49b2-8173-59923defd981-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-latest-newsa374619b-64a4-49b2-8173-59923defd981-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్‌ రెండో దశ విజృంభ‌ణ‌ను అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. నివారణ చర్యలు పాటించే విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇండోర్‌ నగరంలో మాస్కులు ధరించని 258 మందిని పోలీసులు జైలుకు పంప‌డం సంచ‌ల‌నం రేపుతోంది. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. స‌రైన చ‌ర్యేన‌ని కొంద‌రు.. కాదు అని మ‌రికొంద‌రు అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే..! ఇండోర్‌లో కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించే వారిని గుర్తించి, సీఆర్పీసీ సెక్షన్‌ 151 కింద వారిని అదుపులోకి తీసcorona;koti;modi;police;television;prime minister;central government;marchమాస్కు ధ‌రించ‌కుంటే జైలే....258 మంది అరెస్టు...మాస్కు ధ‌రించ‌కుంటే జైలే....258 మంది అరెస్టు...corona;koti;modi;police;television;prime minister;central government;marchThu, 08 Apr 2021 08:50:43 GMT కరోనా వైరస్‌ రెండో దశ విజృంభ‌ణ‌ను అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. నివారణ చర్యలు పాటించే విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇండోర్‌ నగరంలో మాస్కులు ధరించని 258 మందిని పోలీసులు జైలుకు పంప‌డం సంచ‌ల‌నం రేపుతోంది. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. స‌రైన చ‌ర్యేన‌ని కొంద‌రు.. కాదు అని మ‌రికొంద‌రు అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే..! ఇండోర్‌లో కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించే వారిని గుర్తించి, సీఆర్పీసీ సెక్షన్‌ 151 కింద వారిని అదుపులోకి తీసుకుని స్నేహలతాగంజ్‌ ప్రాంతంలోని ఓ అతిథి గృహాన్ని తాత్కాలిక జైలుగా మార్చి అందులో పెడుతున్నారు. జైలుకు తరలించిన వారిని కౌన్సిలింగ్‌ ఇచ్చిన తర్వాత కొంత సమయానికి విడుదల చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ జైల్లో 15 మంది పోలీస్‌ సిబ్బందిని, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.


భారత్‌లో కరోనా కలవరపెడుతోంది. రోజువారీ కేసులు లక్ష దాటుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా లక్ష కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ దేశ వ్యాప్తంగా కొత్తగా లక్షా, 15వేల, 736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాకు 630 మంది బలయ్యారు. దేశ వ్యాప్తంగా కోటి, 28 లక్షల, వెయ్యి, 785కి చేరాయి కరోనా కేసుల సంఖ్య. దేశ వ్యాప్తంగా 8లక్షల 43వేల 473 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,66,177కి చేరుకుంది.దేశంలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా కరోనా నివారణకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.


టెస్టు, ట్రేస్, ట్రీట్, వ్యాక్సినేషన్, కరోనా రూల్స్ పేరిట ఐదు మార్గాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించింది. ఉన్నట్టుండి దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్‌గా భేటీ కానున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ సహా ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌పై చర్చించే అవకాశం ఉంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెండు రాష్ట్రాలతో కేంద్రం కీలక భేటీ... ఎందుకు...?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>