Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fruitsf8012546-1f31-41dc-bd9a-82252a94fb24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fruitsf8012546-1f31-41dc-bd9a-82252a94fb24-415x250-IndiaHerald.jpgశరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి. పండ్లు ఒక్కటే మనకు కడుపు నింపలేవు. శరీరానికి మరింత బలం కావాలంటే పండ్లతో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.మనలో చాలా మంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవడానికి కనపడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం. మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్) లాంటివి తీసుకుంటుంటాం. కానీ ఇలాంటి ఆహారాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర ఎక్కువగా fruits;tara;french fries;dry fruits;heart;cancer;fats;doctor;soybean;sugar;cheque;oil;salt;ghee;neem;cheese;avocadoఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి....?ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి....?fruits;tara;french fries;dry fruits;heart;cancer;fats;doctor;soybean;sugar;cheque;oil;salt;ghee;neem;cheese;avocadoThu, 08 Apr 2021 06:00:00 GMT
శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి. పండ్లు ఒక్కటే మనకు కడుపు నింపలేవు. శరీరానికి మరింత బలం కావాలంటే పండ్లతో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.మనలో చాలా మంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవడానికి కనపడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం. మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్) లాంటివి తీసుకుంటుంటాం. కానీ ఇలాంటి ఆహారాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర ఎక్కువగా వాడుతుంటారు. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. వీటికి బదులుగా తాజా పండ్లు వంటి ప్రత్యామ్నాయాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం.


పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, నట్స్, హోల్ గ్రెయిన్స్ వంటివి మీ డైట్ లో కంపల్సరీ గా ఉండాలి. పెద్ద వాళ్ళు కనీసం నాలుగు వందల గ్రాముల పండ్లు, కూరగాయలు ప్రతి రోజూ తీసుకోవాలి. ప్రతి భోజనం లోనూ కూరగాయలు ఉండేలా చూసుకోవడం, తాజా పండ్లు స్నాక్ గా తీసుకోవడం వంటి కొన్ని మార్పుల వల్ల మీరు ఈ లక్ష్యాన్ని చేరుకోగలరు. సీజనల్ ఫ్రూట్, వెజిటబుల్స్ ని తప్పని సరిగా తీసుకోవాలి. హెల్దీ ఈటింగ్ వలన పోషకాలన్నీ అందుతాయి, డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ గణనీయంగా తగ్గుతుంది.
ఉప్పు తగ్గిస్తే బీపీ కంట్రోల్ లో ఉంటుంది, దాంతో హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. సాస్, సీజనింగ్స్ తగ్గిస్తే సాల్ట్ బాగా తగ్గుతుంది. మీ డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ షేకర్ లేకుండా చేయండి. సాల్ట్ ఎక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోకండి. అలాగే, పంచదార ఎక్కువైతే పళ్ళు పాడయిపోతాయి, బరువు పెరుగుతారు. షుగర్ యాడ్ చేసిన బెవరేజెస్, స్నాక్స్, క్యాండీస్ తగ్గించడం ద్వారా షుగర్ ఇన్‌టేక్ తగ్గించవచ్చు.


ఫ్యాట్స్ చాలా రకాలుంటాయి. అయితే, ట్రాన్స్‌ఫ్యాట్స్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కంటే అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ప్రిఫర్ చేయడం మంచిది. ఈ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ మీకు ఫిష్, అవకాడో, నట్స్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లో లభిస్తుంది. ఫ్యాటీ మీట్, బటర్, పామాయిల్, కోకోనట్ ఆయిల్, క్రీమ్, చీజ్, నెయ్యి వంటి వాటిలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్రైడ్ ఫుడ్, బేక్డ్ ఫుడ్, ఫ్రెఒజెన్ పీజా, కుకీస్, బిస్కెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటి వాటిలో ట్రాన్స్‌ఫ్యాట్స్ లభిస్తాయి.ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ సిర్రోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు వంటివే కాక కొన్ని మానసిక వ్యాధులకి కూడా దారి ఏర్పడుతుంది. మీకు వీలున్నంతగా ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. వారానికి ఒక రోజు నో ఆల్కహాలిక్ డే గా మార్చుకోవడం దగ్గర మొదలు పెడితే నెమ్మదిగా ఈ అలవాటుని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.


స్మోకింగ్ వల్ల ఊపిరి తిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, శ్త్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఈ అలవాటు వల్ల పొగ తాగే వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారి చుట్టు పక్కల ఉన్న వారు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఈ అలవాటుని ఎంత త్వరగా వదిలించుకోగలిగితే అంత మంచిది అంటారు నిపుణులు. ఎక్కువగా నో స్మోకింగ్ ఏరియా లో గడపడం వలన మీకు తెలియకుండానే మీరు ఈ అలవాటుని దారిలోకి తెచ్చుకోగలరు అన్నది వారి సలహా.ఫిజికల్ యాక్టివిటీ అంటే కేవలం రోజు మొత్తం మీద చేసే అరగంట ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. ఆడుకోవడం, పని చేయడం, ఇంట్లో పనులు చేసుకోవడం, ట్రావెల్ చేయడం, ఫన్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం వంటివన్నీ ఫిజికల్ యాక్టివిటీ కిందకే వస్తాయి.



హైబీపీ ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. చాలా మందికి అసలు ఈ సమస్య ఉందనే తెలియదు ఎందుకంటే హైబీపీకి ఎలాంటి లక్షణాలూ ఉండవు, చెక్ చేసుకుంటే తప్ప తెలియదు. దీన్ని కంట్రోల్ లో పెట్టుకోకపోతే హార్ట్, బ్రెయిన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది. అందుకే మీ బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకోవడం అవసరం. ఎక్కువగా ఉందంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేసి వారి సూచనల ప్రకారం చేయండి.
తుమ్మినా దగ్గినా నోరు కవర్ చేసుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు ఒకరి నుండి ఒకరికి సంక్రమించకుండా ఉంటాయి. మీకు దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూతో కవర్ చేసుకుని ఆ టిష్యూని జాగ్రత్తగా డిస్పోజ్ చేయండి. మీ దగ్గర టిష్యూ లేకపోతే మోచేయి వంపు నోటి దగ్గరగా పెట్టుకుని తుమ్మండి. చేత్తో నోరు కవర్ చేసుకుంటే మళ్ళీ ఆ చేతితో దేన్ని తాకినా కూడా వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో వ‌రుస ఎన్నిక‌లు

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>