MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-puts-aacharya-under-suspence-becomes-news0a9e419c-d89b-4942-81e2-8caff017c8f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-puts-aacharya-under-suspence-becomes-news0a9e419c-d89b-4942-81e2-8caff017c8f6-415x250-IndiaHerald.jpgచిరంజీవి రామ్ చరణ్ ల ‘ఆచార్య’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ మూవీని గత సంవత్సరం దసరా కు విడుదల చేద్దామని భావించారు. అయితే కరోనా పరిస్థితులతో అన్నీ తారుమారు అవ్వడంతో ఈమూవీని అనేక ఆలోచనలు చేసి చివరకు సమ్మర్ రేస్ ను టార్గెట్ చేసే విధంగా మే 13న విడుదల చేయడానికి నిర్ణయించడమే కాకుండా ఆమూవీ ప్రమోషన్ ను కూడ మొదలుపెట్టేసారు. చిరంజీవి నటించిన ‘సైరా’ ఫలితం నిరాశ పరచడమే కాకుండా ఆమూవీని నిర్మించిన చరణ్ కు కోట్ల రూపాయాలలో నష్టాలు వచ్చాయి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనితో చిరంజీవి అనేక ఆలోచchirangeevi;;business;pawan;view;chiranjeevi;ram charan teja;mani sharma;ram pothineni;tara;dussehra;geum;cinema;youtube;you tube;saira narasimhareddy;vijayadashamiఆచార్య ను సస్పెన్స్ లో పెట్టిన పవన్ !ఆచార్య ను సస్పెన్స్ లో పెట్టిన పవన్ !chirangeevi;;business;pawan;view;chiranjeevi;ram charan teja;mani sharma;ram pothineni;tara;dussehra;geum;cinema;youtube;you tube;saira narasimhareddy;vijayadashamiThu, 08 Apr 2021 11:00:00 GMTచిరంజీవి రామ్ చరణ్ ల ‘ఆచార్య’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ మూవీని గత సంవత్సరం దసరా కు విడుదల చేద్దామని భావించారు. అయితే కరోనా పరిస్థితులతో అన్నీ తారుమారు అవ్వడంతో ఈమూవీని అనేక ఆలోచనలు చేసి చివరకు సమ్మర్ రేస్ ను టార్గెట్ చేసే విధంగా మే 13న విడుదల చేయడానికి నిర్ణయించడమే కాకుండా ఆమూవీ ప్రమోషన్ ను కూడ మొదలుపెట్టేసారు.


చిరంజీవి నటించిన ‘సైరా’ ఫలితం నిరాశ పరచడమే కాకుండా ఆమూవీని నిర్మించిన చరణ్ కు కోట్ల రూపాయాలలో నష్టాలు వచ్చాయి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనితో చిరంజీవి అనేక ఆలోచనలు చేసి ‘ఆచార్య’ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈమూవీ ద్వారా 150 కోట్ల బిజినెస్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.  ఈ టార్గెట్ కు అనుగుణంగా ఈమధ్య మణిశర్మ స్వరపరిచిన 'లాహే లాహే' అనే పాటని విడుదల చేశారు.


ప్రస్తుతం ఈపాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉంది. ఈపాట బాగుండటంతో పాటు ఇందులో చిరంజీవి మునుపటి గ్రేస్ తో వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడంతో ఈపాటకు ఇప్పటివరకు 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనితో ‘ఆచార్య’ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అనుకున్నారు అంతా. అయితే ఈ మూవీ అనుకున్న తేదీకి విడుదల అయ్యే విషయం ‘వకీల్ సాబ్’ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.


‘వకీల్ సాబ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ మూవీకి ఫ్యామిలీ ప్రేక్షకులు ప్రస్తుత కరోనా పరిస్థితులు వల్ల ధియేటర్లకు దూరంగా ఉంటే ‘ఆచార్య’ మూవీ నిర్మాతలు సాహసం చేయకూడదని ఈ మూవీ విడుదలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచిఉండాలని ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులలో ఓవర్సీస్ కలక్షన్స్ కూడ అంతంత మాత్రంగా ఉంటున్న నేపధ్యంలో మితిమీరిన ఆత్మవిశ్వాసానికి అవకాశం ఇవ్వకుండా సేఫ్ గేమ్ ఆడాలని ‘ఆచార్య’ టీమ్ ఆలోచన అన్న మాటలు వినిపిస్తున్నాయి..






ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బా... పుష్ప టీజర్ గురించి మెగాస్టార్ ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి .....పోస్ట్ వైరల్ .... !!

సరిలేరు నీకెవ్వరు సినిమాలో.. పక్కింటి కుర్రాడు రెమ్యూనరేషన్ గురించి అసలు విషయం చెప్పేసాడు..?

హ‌డ‌లిపోతున్న వైసీపీ నేత‌లు.. రీజ‌నేంటి ?

జగన్ తిరుపతి ప్రచారం వెనక మాస్టర్ ప్లాన్...?

దేశంలో క‌రోనా విల‌యం..మ‌హ‌మ్మారి బారిన అన్ని వేల‌మంది చిన్నారులు

పవన్ మౌనం పై అంజలి షాకింగ్ కామెంట్స్ !

బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>