Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli25f42238-817d-4692-b34b-6c8dbaf606d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli25f42238-817d-4692-b34b-6c8dbaf606d9-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇక గతేడాది కరోనా సమయంలో జరిగిన ఐపీఎల్ ప్రత్యేకంగా అందరికీ గుర్తుంటుంది. అయితే కరోనా చైనా నుంచి వచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో మన దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని భారీగా నిరసనలు..VIRAT KOHLI;mumbai;virat kohli;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;bengaluru 1;royal challengers;indianచైనా సంస్థకు మళ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీచైనా సంస్థకు మళ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీVIRAT KOHLI;mumbai;virat kohli;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;bengaluru 1;royal challengers;indianThu, 08 Apr 2021 19:05:48 GMTఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇక గతేడాది కరోనా సమయంలో జరిగిన ఐపీఎల్ ప్రత్యేకంగా అందరికీ గుర్తుంటుంది. అయితే కరోనా చైనా నుంచి వచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో మన దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని భారీగా నిరసనలు జరిగాయి. అందులో భాగంగా చైనా మొబైల్ కంపెనీ వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. కానీ, మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్ 2021 ప్రధాన స్పాన్సర్‌గా వ్యహరింస్తోంది. అంతేకాకుండా తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న క్రేజ్‌ అందరికీ తెలిసిందే. అతడికి దాయాది దేశం పాకిస్తాన్‌లోనూ అభిమానులకు కొదవ లేదు. కాబట్టి తమ ఉత్పత్తుల ప్రమోషన్‌కు అతడి క్రేజ్ బాగా ఉపయోగపడుతుందని ఈ నిర్ణయించుకున్నట్లు వివో సంస్థ తెలిపింది. టెక్నాలజీ అంటే ఆసక్తి ఉండే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ పేర్కొంది. కోహ్లీ.. తన కాంట్రాక్ట్‌లో భాగంగా సంస్థ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడని కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని వివో తెలిపింది.
     
కాగా.. రేపటి(శుక్రవారం) నుంచి ఐపీఎల్ 14వ సీజన్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్‌ అధికారిక టైటిల్‌ స్పాన్సర్‌గా వివో వ్యవహరిస్తోంది. ఈ సమయంలో టైటిల్‌ స్పాన్సర్‌ వివో తన సంస్థకు కోహ్లీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం ప్రాముఖ్యం సంతరించుకుంది.  
      
ఇదిలా ఉంటే ఐపీఎల్ తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌కు మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 7:30కు జరగనుంది. మరి తొలి మ్యాచ్‌లో గెలిచి ఏ జట్టు బోణీ కొడుతుందో వేచి చూడాలి.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరణ్ కి రంగస్థలం ఎలాగో .... అల్లు అర్జున్ కి ఈ మూవీ అలానట ....??

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>