PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani77af73a7-51b5-4597-835c-ede8aabfd9dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani77af73a7-51b5-4597-835c-ede8aabfd9dd-415x250-IndiaHerald.jpgఅయితే.. ఈ ప్ర‌క‌ట‌న‌తో పలువురు తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి మొదలయ్యింది. ఏకంగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, బుచ్చ‌య్య చౌద‌రి, అశోక్‌గ‌జ‌ప‌తిరాజు వంటి సీనియ‌ర్లు.. ఉద్దండులు సైతం.. బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. ఇక‌, కీల‌క నేత‌లే బాబును త‌ప్పుప‌ట్ట‌గా.. క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్లు ఊరుకుంటారా? అదే జ‌రిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి, విశాఖ‌, ఉభ‌య గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తాము బరిలోకి దిగి తీరుతామని నేతలు చెబుతున్నారు. పోటీలో కొనసాగాలని నిర్ణయం తీసుకొని ప్రచార రంగంలోకి కూడా దూకుతున్నారు. ap-zptc-mptc-elections-2021;cbn;ntr;nani;kodali nani;nithya new;tiru;godavari river;krishna river;devineni avinash;రాజీనామా;district;tirupati;minister;husband;mangalagiri;krishna district;letter;tdp;local language;ycp;nandamuri taraka rama rao;devineni uma maheswara rao;party;mantra;nandivadaచ‌క్రం తిప్పిన మంత్రి నాని... వైసీపీ ఖాతాలో ఓ విజ‌యంచ‌క్రం తిప్పిన మంత్రి నాని... వైసీపీ ఖాతాలో ఓ విజ‌యంap-zptc-mptc-elections-2021;cbn;ntr;nani;kodali nani;nithya new;tiru;godavari river;krishna river;devineni avinash;రాజీనామా;district;tirupati;minister;husband;mangalagiri;krishna district;letter;tdp;local language;ycp;nandamuri taraka rama rao;devineni uma maheswara rao;party;mantra;nandivadaThu, 08 Apr 2021 08:36:00 GMTప్ర‌స్తుతం తీవ్ర క‌ష్టాల్లో ఉన్న టీడీపీకి మ‌రో బ‌ల‌మైన దెబ్బ త‌గిలింది. అదికూడా టీడీపీని, పార్టీ అధినేత‌ను నిత్యం తిట్టిపోసే.. మంత్రి కొడాలి నాని నుంచి పార్టీకి తీవ్ర‌మైన శ‌రాఘాతం త‌గిలింది. అయితే.. ఇంత జ‌రిగినా.. పార్టీ నాయ‌కులు ఎవ‌రూ ముందు కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏ ఒక్క‌రూ నానిని త‌ప్పుప‌ట్ట‌లేదు. చోద్యం చూస్తూ.. ఉండిపోయారు. మ‌రి ఏం జ‌రిగింది? ఏంటి? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇటు పరిషత్.. అటు తిరుపతి ఉపఎన్నికలు టీడీపీకి స‌వాలుగా మారాయి. తిరుప‌తి ఉప పోరులో పోటీ చేస్తున్నా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదని ఆ పార్టీ అధినేత   చంద్రబాబు నిర్ణ‌యించారు.

అయితే.. ఈ ప్ర‌క‌ట‌న‌తో పలువురు తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి మొదలయ్యింది. ఏకంగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, బుచ్చ‌య్య చౌద‌రి, అశోక్‌గ‌జ‌ప‌తిరాజు వంటి సీనియ‌ర్లు.. ఉద్దండులు సైతం.. బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. ఇక‌, కీల‌క నేత‌లే బాబును త‌ప్పుప‌ట్ట‌గా.. క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్లు ఊరుకుంటారా? అదే జ‌రిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి, విశాఖ‌, ఉభ‌య గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తాము బరిలోకి దిగి తీరుతామని నేతలు చెబుతున్నారు. పోటీలో కొనసాగాలని నిర్ణయం తీసుకొని ప్రచార రంగంలోకి కూడా దూకుతున్నారు.

దీనికి స్థానిక సీనియ‌ర్లు సైతం మ‌ద్ద‌తుగా ఉన్నారు. దీంతో ప్ర‌చారం కూడా బాగానే సాగుతోంది. కొన్ని చోట్ల బాబు ఫొటోల‌ను ప‌క్క‌న పెట్టి ఎన్టీఆర్ ఫొటోల‌తో నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇంత వ‌ర‌కు బాగానేఉన్నా.. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్క‌డ మంత్రి కొడాలి నాని.. చ‌క్రం తిప్పారు. బాబు ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. టీడీపీ నేత‌ల్లో పెల్లుబికిన అసంతృప్తిని ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలోనే నందివాడ మండల టీడీపీ జడ్పీటీసి అభ్యర్థి దాసరి మేరీ విజయ కుమారి ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. తన రాజీనామా లేఖను అధిష్టానంకు పంపిన మేరీ.. మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు.

జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు విజయ వెల్లడించారు. మేరీతో పాటు, పలువురు టీడీపీ నాయకులు, ద్వితియ శ్రేణి నేతలు, కార్యకర్తలకు వైసీపీ కండువాలు కప్పిన మంత్రి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే.. ఇంత జ‌రిగినా.. పార్టీ నాయ‌కులు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు ర‌వీంద్ర‌లు నోరు మెద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నించిన వారు.. మంత్రి దెబ్బ‌కు టీడీపీ వాయిస్ క‌ట్ అయింద‌ని కామెంట్లు చేస్తున్నారు.

 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాలుగు న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూ

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>