Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polling930312b7-9646-489d-8173-2e97a2721fed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polling930312b7-9646-489d-8173-2e97a2721fed-415x250-IndiaHerald.jpgఏపీలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో అటు ఆంధ్ర రాజకీయాలు మొత్తం ఎంతో హాట్ హాట్ గా మారిపోయాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అన్ని పార్టీలు కూడా పరిషత్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే అటు ప్రతిపక్ష టిడిపి పార్టీ పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం పలు ప్రాంతాలలో పోటీ చేయాలని అనుకోవటం ఆసక్తి కరం గా మారిపోయింది. ఇకపోతే అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలోనే కసరత్తులు చేశాయి.Polling;andhra pradesh;tdp;partyపరిషత్ ఎన్నికల పోలింగ్ మొదలైంది.. పూర్తి వివరాలు ఇవే..?పరిషత్ ఎన్నికల పోలింగ్ మొదలైంది.. పూర్తి వివరాలు ఇవే..?Polling;andhra pradesh;tdp;partyThu, 08 Apr 2021 09:17:30 GMTటిడిపి పార్టీ పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం పలు ప్రాంతాలలో పోటీ చేయాలని అనుకోవటం ఆసక్తి కరం గా మారిపోయింది. ఇకపోతే అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా  ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలోనే కసరత్తులు చేశాయి.  తమ దగ్గర ఉన్న అన్ని రకాల అస్త్రాలను  కూడా సంధించారు అభ్యర్థులు.



 ఇక జెడ్పిటిసి ఎంపీటీసీ ఎలక్షన్లలో తమదే విజయమని అంటూ అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ధీమా వ్యక్తం చేశారు.  అదే సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి అటు అన్ని పార్టీల అభ్యర్థులు కూడా భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇన్ని రోజుల వరకు అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా.. అభ్యర్థుల భవితవ్యం ఏంటి అనేది నేడు ఓటర్లు తేల్చనున్నారు. ఇక అభ్యర్థులు ఓటర్లను ఎంత ఆకట్టుకున్నారు అనేది నేడు తేలిపోతుంది. ఏపీలో నేడు ఉదయం నుంచి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.


 ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇకపోతే 515 జడ్పిటిసి, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు తెలుస్తోంది జడ్పిటిసి బరిలో 2058 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఎంపీటీసీ బరిలో 18782 మంది పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల 751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల 47 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>