Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mid-night-fooda779d96e-a5c2-42d2-9f78-a4e135d3586d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mid-night-fooda779d96e-a5c2-42d2-9f78-a4e135d3586d-415x250-IndiaHerald.jpgచాలామంది సమయానికి ఆహారాన్ని తినరు. దీంతో అర్ధరాత్రిళ్లు ఆకలేసి.. ఏది పడితే అది లాగించేస్తారు. దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రిళ్లు లేదా లేటుగా డిన్నర్ చేసి తినేవారి రక్తంలో చక్కెర శాతం విపరీతంగా పెరిగిపోతుందని ఓ సర్వేలో తేలింది. అంతేగాక శరీరానికి చేటు చేసే కొవ్వులు పెరిగి గుండె సమస్యలు వస్తాయని హెచ్చరించింది.మన పూర్వికులు కూడా చాలాసార్లు ఈ విషయంపై హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా అర్ధరాత్రిళ్లు లేచి గిన్నెలు వెతుక్కుంటే.. వారిని ‘దెయ్యం తిండి’ తింటున్నారనmid night food;chiranjeevi;television;heart;california;cholesterolఅర్ధరాత్రి ఆహరం తినవచచ్చా....?అర్ధరాత్రి ఆహరం తినవచచ్చా....?mid night food;chiranjeevi;television;heart;california;cholesterolThu, 08 Apr 2021 07:00:00 GMTచాలామంది సమయానికి ఆహారాన్ని తినరు. దీంతో అర్ధరాత్రిళ్లు ఆకలేసి.. ఏది పడితే అది లాగించేస్తారు. దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రిళ్లు లేదా లేటుగా డిన్నర్ చేసి తినేవారి రక్తంలో చక్కెర శాతం విపరీతంగా పెరిగిపోతుందని ఓ సర్వేలో తేలింది. అంతేగాక శరీరానికి చేటు చేసే కొవ్వులు పెరిగి గుండె సమస్యలు వస్తాయని హెచ్చరించింది.మన పూర్వికులు కూడా చాలాసార్లు ఈ విషయంపై హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా అర్ధరాత్రిళ్లు లేచి గిన్నెలు వెతుక్కుంటే.. వారిని ‘దెయ్యం తిండి’ తింటున్నారని అనేవారు. దెయ్యం తిండి తినడం మంచిది కాదని, అనారోగ్యానికి గురవ్వుతారని హెచ్చరించేవారు. వారి మాటలు ముమ్మాటికీ నిజమేనంటూ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం గతంలో తేల్చి చెప్పింది.


 ఇప్పుడు ఆ దెయ్యం తింటే ప్రజల లైఫ్‌స్టైల్‌లో భాగమైంది. అర్ధరాత్రిళ్లు స్నేహితులతో కలిసి ఆహారం తింటూ ఎంజాయ్ చేసేవారు కొందరైతే. పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్ల సమయానికి తినలేక.. అర్ధరాత్రి ఆహారం తీసుకొనేవారు మరికొందరు. అయితే, ఇది అలవాటుగా మారితే ఎంత ప్రమాదమో తెలుసా? ముఖ్యంగా నైట్ డ్యూటీలు చేసేవారు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.


పోష‌కాహార నిపుణులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం నిద్రపోయే ముందు రెండు గంటల ముందే ఆహారాన్ని తినేయాలి. తిన్న వెంటనే నిద్రపోతే రక్తంలో చక్కెర శాతం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి.. డయాబెటీస్ రోగులతో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. నిద్రపోడానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. అర్ధరాత్రిళ్లు ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో చూడండి.నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగటంతో పాటు కొవ్వు పదార్థాలు పెరిగి గుండె సమస్యలు ఏర్పడతాయి. వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్‌ ఫుడ్‌ అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది.



నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. చాలామంది టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు అతిగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై ప్రభావం చూపుతాయని ఓ పరిశోధనలో పేర్కొన్నారు.కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కొన్నేళ్లు అర్ధరాత్రిళ్లు జంక్‌ఫుడ్‌ తినే వారిని పరిశీలించారు. వారిపై అనేక పరిశోధనలు జరిపారు. నిద్రపోయే ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైనట్లు గమనించారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి.. మీకు కూడా ఈ అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానుకోండి. లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవు



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీకి రెండో డోస్ వ్యాక్సిన్‌... ఆ ఇద్ద‌రు న‌ర్సులే స్పెష‌ల్‌

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>