PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisionse0e5c5c6-1abb-47e2-99c2-8636ad9d8b41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisionse0e5c5c6-1abb-47e2-99c2-8636ad9d8b41-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా 2.0 కోరలు చాచుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రోజు వారీ కరోనా కేసులు రెండు వేలు దాటాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా బుధ‌వారం భారీ స్థాయిలో కేసులు న‌మోదు కాగా గురు‌వారం ఉద‌యం హెల్త్‌బులిటెన్‌లో ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కొత్తగా 1,26,789 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 685 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశవ్యాప్త రికవరీ రేటు 91.67 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.29 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 12లక్షల 37వేల నమూcorona;telangana;central government;april;marchదేశంలో క‌రోనా విల‌యం..మ‌హ‌మ్మారి బారిన అన్ని వేల‌మంది చిన్నారులుదేశంలో క‌రోనా విల‌యం..మ‌హ‌మ్మారి బారిన అన్ని వేల‌మంది చిన్నారులుcorona;telangana;central government;april;marchThu, 08 Apr 2021 10:20:00 GMTదేశంలో కరోనా 2.0 కోరలు చాచుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రోజు వారీ కరోనా కేసులు రెండు వేలు దాటాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా బుధ‌వారం భారీ స్థాయిలో కేసులు న‌మోదు కాగా గురు‌వారం ఉద‌యం హెల్త్‌బులిటెన్‌లో ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కొత్తగా 1,26,789 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 685 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశవ్యాప్త రికవరీ రేటు 91.67 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.29 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 12లక్షల 37వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.


 దీంతో మొత్తం టెస్ట్ల సంఖ్య 25 కోట్ల 26 లక్షలు దాటింది. ఇక‌త తెలంగాణ రాష్ట్రంలో బుధ‌వారం రాత్రి 8గంటల వరకు 87,332 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,055 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,741కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13,362 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండ‌గా గతంలో వయోజనులపై ప్రభావం చూపగా... ఇప్పుడు చిన్నారులపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది.


నెల రోజుల్లోనే కేవలం ఐదు రాష్ట్రాల్లో 79,688 మంది చిన్నారులు కోవిడ్‌ బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పెద్దలకు వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ...ఇప్పటికైతే చిన్న పిల్లలకు టీకా అందుబాటులోకి రాలేదు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో చిన్నారులపై పరీక్షలు జరిపినప్పటికీ... రక్తం గడ్డ కట్టడంతో పాటు, ఏడుగురు మరణించిన నేపథ్యంలో ఆ వ్యాక్సిన్‌ను నిలుపుదల చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ట్రలోనే 60,684 మంది చిన్నారులకు కరోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9,882 మంది ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో 5,940 మంది పిల్లలు కోవిడ్‌ బారిన పడగా..922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ ఇరుక్కున్నారా...?

బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

శ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..

చిరంజీవిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>