PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-e78f2dae-9dc9-4395-983d-b6652122a2be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-e78f2dae-9dc9-4395-983d-b6652122a2be-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాలు కూడా బ్యాలన్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 3న పవన్ తిరుపతిలో భారీ రోడ్ షో తో పాటు బహిరంగ సభ నిర్వహించి ప్రత్యర్ధుల్లో దడ పుట్టించారు. పవన్ పొలిటికల్ చరిష్మాకు అద్దం పట్టినట్లుగా ఈ రోడ్ షో సభ సాగాయని గట్టిగానే చెప్పాల్సిందే.pawan;pawan;kalyan;tiru;bharatiya janata party;jagan;tirupati;assembly;husband;partyపవన్ మళ్ళీ తిరుపతి టూర్ ?పవన్ మళ్ళీ తిరుపతి టూర్ ?pawan;pawan;kalyan;tiru;bharatiya janata party;jagan;tirupati;assembly;husband;partyThu, 08 Apr 2021 17:05:05 GMTపవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాలు కూడా బ్యాలన్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 3న పవన్ తిరుపతిలో భారీ రోడ్ షో తో పాటు బహిరంగ సభ నిర్వహించి ప్రత్యర్ధుల్లో దడ పుట్టించారు. పవన్ పొలిటికల్ చరిష్మాకు అద్దం పట్టినట్లుగా ఈ రోడ్ షో సభ సాగాయని గట్టిగానే  చెప్పాల్సిందే.

ఈ నేపధ్యంలో నోటా తో పోటీ పడుతున్న పార్టీ అని బీజేపీని ఎగతాళిని చేసిన వారంతా ఒక్కసారిగా వణికారు. తిరుపతితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీలో జనసేనకు ఓట్లు చాలానే ఉన్నాయి. అవి బీజేపీకి మళ్ళితే గట్టిగానే ఫైట్ ఇచ్చే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే పవన్ ఒకసారి ప్రచారం చేస్తేనే ఈ ఊపు వచ్చింది. మరోసారి కనుక ఆయన తిరిగితే కచ్చితంగా బీజేపీకి రాజకీయ లాభం బాగానే ఉంటుంది అంటున్నారు. దాంతో పవన్ని మరోసారి చివరలో ప్రచారానికి రప్పిస్తారా అన్న చర్చ అయితే  బీజేపీలో సాగుతోంది.

బీజేపీకి చెందిన నాయకులు అంతా ఉత్తరాదికి చెందిన వారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు. వారు వచ్చి ప్రచారం చేసినా ఆ ఇంపాక్ట్ తిరుపతి ఎన్నికల్లో పెద్దగా ఉండదు అన్నది తెలిసిందే. అదే పవన్ని మరోసారి ప్రచారానికి తెచ్చుకుంటే గణనీయంగా బీజేపీకి మేలు చేకూరుతుంది అంటున్నారు. దాంతో ఇపుడు బీజేపీ నాయకుల చూపు పవన్ మీద పడింది. మరి పవన్ ఇప్పటికే తిరుపతి ఉప‌ ఎన్నికను భుజాల మీద వేసుకోవాలి కానీ బీజేపీ నేతల వైఖరి వల్లనే కొంత తగ్గారని అంటున్నారు. మరి ఆయన కనుక ఓకే అంటే మాత్రం అటు చంద్రబాబు, ఇటు జగన్ మధ్యలో పవన్ తో తిరుపతి ఉప ఎన్నిక ఒక్కసారిగా వేడెక్కిపోవడం ఖాయమే అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ని ప్రచారానికి తీసుకురావడానికి బీజేపీ చేసే ప్రయత్నాలు ఎంతవరకూ సఫలం అవుతాయో చూడాలి.









ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భౌతిక దూరానికి షార్ట్ కట్ ఇదేనంటున్నా ఆనంద్ మహీంద్రా....

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>