PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down6138d46b-cae7-45cd-93a9-9e57e4aa8b08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down6138d46b-cae7-45cd-93a9-9e57e4aa8b08-415x250-IndiaHerald.jpgఒక్క రోజులోనే ల‌క్ష‌కు పైగా పాజిటివ్ కేసుల‌తో కొవిడ్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ వేగంగా సాగుతుండ‌గా.. మ‌రోవైపు లాక్‌డౌన్‌, నైట్ క‌ర్ఫ్యూ, 144 సెక్ష‌న్లూ అంతే వేగంగా అమ‌లు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, పంజాబ్‌, బెంగ‌ళూరు, రాయపూర్.. ఇలా ఒక్కో రాష్ట్రం, ఒక్కో న‌గ‌రం లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి.lock down;amala akkineni;bharathi old;mumbai;delhi;karnataka - bengaluru;district;collector;bengaluru 1;raipur;partyదేశంలో లాక్ డౌన్ తప్పదా?దేశంలో లాక్ డౌన్ తప్పదా?lock down;amala akkineni;bharathi old;mumbai;delhi;karnataka - bengaluru;district;collector;bengaluru 1;raipur;partyThu, 08 Apr 2021 09:17:28 GMTదేశ‌మంతా క‌రోనా గుప్పిట్లోకి జారుకుంటోంది. ఒక్క రోజులోనే ల‌క్ష‌కు పైగా పాజిటివ్ కేసుల‌తో కొవిడ్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.  దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ వేగంగా సాగుతుండ‌గా.. మ‌రోవైపు లాక్‌డౌన్‌, నైట్ క‌ర్ఫ్యూ, 144 సెక్ష‌న్లూ అంతే వేగంగా అమ‌లు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, పంజాబ్‌, బెంగ‌ళూరు, రాయపూర్.. ఇలా ఒక్కో రాష్ట్రం, ఒక్కో న‌గ‌రం లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి.

కరోనా ఉద్ధృతితో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బెంగళూరు నగర పరిధిలో బుధ‌వారం నుంచి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని ఈత కొలనులు, జిమ్‌లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  బెంగళూరులో ఒక్క రోజులోనే 4,266 కేసులు న‌మోదు కాగా.. వారిలో 26మంది చ‌నిపోవ‌డంతో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం న‌గ‌రంలో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది.

ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ విధించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఢిల్లీ స‌మీపంలోని పంజాబ్‌లోనూ క‌రోనా కేసులు భారీగా పెరుగుతుండ‌టంతో ఆ రాష్ట్రంలోనూ రాత్రి క‌ర్ఫ్యూ ప్ర‌క‌టిస్తూ ఆదేశాలు జారీ చేసింది అమ‌రీంద‌ర్‌సింగ్ ప్ర‌భుత్వం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఉద్యోగులందరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. పంజాబ్‌లో ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని ఆంక్ష‌లు విధించారు. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేతలతో పాటు ఇతరులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే పంజాబ్‌లో విద్యాసంస్థ‌లు మూసి వేశారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ క‌రోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. రాయ‌పూర్ జిల్లాలో శుక్ర‌వారం నుంచి 10 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. 9వ తేదీ రాత్రి 6 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకూ పూర్తి కోవిడ్-19 కంటైన్‌మెంట్ జోన్ చర్యలు అమలు చేయనున్నట్టు జిల్లా యంత్రాగం తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో జిల్లా సరిహద్దులన్నీ మూసివేస్తున్నట్టు రాయపూర్ జిల్లా కలెక్టర్ ఎస్.భారతి దాసన్ చెప్పారు.
 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పరిషత్ ఎన్నికల పోలింగ్ మొదలైంది.. పూర్తి వివరాలు ఇవే..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>