HealthGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-children6a500958-7e66-46b0-b04a-5414dcf46971-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-children6a500958-7e66-46b0-b04a-5414dcf46971-415x250-IndiaHerald.jpgపెద్ద‌వారిక‌న్నా చిన్న పిల్లలకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ‌గా వస్తాయనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. రోజూ దుమ్ములో ఆడుకోవ‌డంతోపాటు స్కూల్‌లోనూ ఇత‌ర పిల్లలతో క‌ల‌సి తిరుగుతారు కాబ‌ట్టి వారికి వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. శుభ్ర‌త కూడా ఎక్కువ‌గా పాటించ‌రు. అనారోగ్యానికి గుర‌వ‌కుండా వారిలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచితే ఇన్‌ఫెక్షన్లు నుంచి త‌ప్పించుకున్న‌ట్ల‌వుతుంది. వారిలో ఆ శ‌క్తిని పెంపొందించాల్సిన బాధ్య‌త మ‌న‌పైనే ఉంది. health, children;tara;tiru;garlic;strawberry;ayurveda;central government;indian gooseberryమ‌న చిట్టి పొట్టి చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే....మ‌న చిట్టి పొట్టి చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే....health, children;tara;tiru;garlic;strawberry;ayurveda;central government;indian gooseberryThu, 08 Apr 2021 21:14:23 GMT
పెద్ద‌వారిక‌న్నా చిన్న పిల్లలకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ‌గా వస్తాయనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. రోజూ దుమ్ములో ఆడుకోవ‌డంతోపాటు స్కూల్‌లోనూ ఇత‌ర పిల్లలతో క‌ల‌సి తిరుగుతారు కాబ‌ట్టి వారికి వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. శుభ్ర‌త కూడా ఎక్కువ‌గా పాటించ‌రు. అనారోగ్యానికి గుర‌వ‌కుండా వారిలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచితే ఇన్‌ఫెక్షన్లు నుంచి త‌ప్పించుకున్న‌ట్ల‌వుతుంది. వారిలో ఆ శ‌క్తిని పెంపొందించాల్సిన బాధ్య‌త మ‌న‌పైనే ఉంది.

ప్రొటీన్స్, నిద్ర‌
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి.  ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉండే ఆహారం ఇవ్వ‌డంతోపాటు నిమ్మ జాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకు ప‌చ్చని కూర‌గాయ‌లు, బీన్స్‌, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి, అల్లం తినిపిస్తుండాలి. పిల్లలన్నాక నిద్రపోకుండా మారాం చేయ‌డం స‌హ‌జ‌మే. కొంద‌రు పిల్లలయితే అర్ధరాత్రి వ‌ర‌కు గేమ్స్ ఆడుతూ కాల‌క్షేపం చేస్తుంటారు. త‌ల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను త్వరగా నిద్ర‌పుచ్చాలి. స‌రిగా నిద్ర లేక‌పోతే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయో త‌ల్లిదండ్రులు చెప్పాలి. వారిని కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇత‌ర గ్యాడ్జెట్లకు వీలైనంత దూరంగా ఉంచాలి. నిద్ర త‌గినంత‌గా ఉంటే పిల్లల్లో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి  పెరుగుతుంది.

శుభ్రత అల‌వాటు చేయాలి
ఆహారం తినేముందు, తిన్నాక చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాల‌ని పిల్లలకు చెప్పాలి. మ‌నం చేసి చూపించాలి. ఆట‌లు ఆడుకున్నాక, కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులను ప‌ట్టుకున్న‌త‌ర్వాత‌ చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోమ‌ని చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు వ‌చ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం దుమ్ము, ధూళిలో గ‌డ‌ప‌డం వ‌ల్ల‌, పెంపుడు జంతువుల‌ను ప‌ట్టుకోవ‌డం వ‌ల్లే వ‌స్తాయి. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌పైనే ఉంది.

రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంచాలి
పిల్లలకు గుడుచి, ఉసిరి, య‌ష్టిమ‌ధు, గుగ్గుళ్లు  త‌దిత‌ర ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ ఇస్తుండాలి. చ్య‌వ‌న‌ప్రాశను అల‌వాటు చే‌యాలి. వైద్యుల సూచ‌న మేర‌కు వీటిని పిల్లలకు ఇస్తుంటే పిల్లల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. ఇంగ్లిషు మందుల‌క‌న్నా చిన్న‌ప్ప‌టినుంచి ఆయుర్వేదం అల‌వాటు చేయ‌డంవ‌ల్ల ఎట‌వంటి ప్ర‌తికూల వాతావ‌రణాన్నైనా త‌ట్టుకునే శ‌క్తి ఏర్ప‌డుతుంద‌ని, ఆ దిశ‌గా త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్ని స‌మాయ‌త్త‌మ‌య్యేలా చూడాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా సూచిస్తోంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నన్నే సీఎం కావాలంటున్నారు.. తిరుపతిలో చంద్రబాబు కామెంట్స్

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>