PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan86591356-033f-4c9d-8cb8-4d9269fcefba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan86591356-033f-4c9d-8cb8-4d9269fcefba-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో మూడో శక్తిగా ఎదిగేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రయత్నిస్తుందా? అంటే ప్రస్తుతానికైతే ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఎందుకంటే ఏపీలో వైసీపీ, టీడీపీలు బాగా బలంగా ఉన్నాయి. ప్రస్తుతం అధికార వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది. ఆ తర్వాత టీడీపీకి కూడా ఎక్కువ బలం ఉందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే టీడీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉంది.pawan kalyan;pawan;pawan kalyan;tiru;andhra pradesh;janasena;2019;bank;assembly;mla;cheque;tdp;central government;ycp;janasena party;partyజనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?pawan kalyan;pawan;pawan kalyan;tiru;andhra pradesh;janasena;2019;bank;assembly;mla;cheque;tdp;central government;ycp;janasena party;partyThu, 08 Apr 2021 03:00:00 GMT

ఏపీ రాజకీయాల్లో మూడో శక్తిగా ఎదిగేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రయత్నిస్తుందా? అంటే ప్రస్తుతానికైతే ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఎందుకంటే ఏపీలో వైసీపీ, టీడీపీలు బాగా బలంగా ఉన్నాయి. ప్రస్తుతం అధికార వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది. ఆ తర్వాత టీడీపీకి కూడా ఎక్కువ బలం ఉందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే టీడీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉంది.


ఇక వీరి మధ్యలో జనసేనకు బలం పుంజుకోలేకపోతుంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. అలాగే 7 శాతం వరకు ఓట్లు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఒక్కశాతం ఓట్లు కూడా లేని బీజేపీతో కలిసి ముందుకెళుతుంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతోనే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తుంది. అయితే జనసేన ఇలాగే కంటిన్యూ అయితే ఆ పార్టీ బలం పెరుగుతుందా అంటే చెప్పడం కష్టమే. వైసీపీ, టీడీపీల బలాలు తగ్గనంత వరకు జనసేన పుంజుకోలేదు.


అలాగే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే జనసేనకు లాభం కూడా ఉండదని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలుగు తమ్ముళ్ళు జనసేనకు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. తమతో కలిసి ముందుకెళితే వైసీపీకి చెక్ పెట్టొచ్చని, అలాగే కొన్ని సీట్లని గెలుచుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


అయితే ప్రస్తుతం టీడీపీ ఒంటరిగా వైసీపీకి చెక్ పెట్టలేదు. అదే జనసేనతో కలిసి బరిలో ఉంటే, నెక్స్ట్ వైసీపీని ఓడించి అధికారంలోకి వచ్చేయొచ్చు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ-జనసేనలు ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి, వైసీపీకి లబ్ది చేకూరుతుందని, అదే కలిసి పోటీ చేస్తే ఫలితం వేరుగా ఉంటుందని మాట్లాడుతున్నారు. ఏదేమైనా టీడీపీతో కలిసి పోటీ చేస్తేనే జనసేనకు బెన్‌ఫిట్ అని తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. మొత్తానికైతే జనసేనని బుట్టలో వేసుకోవాలని టీడీపీ గట్టిగానే ట్రై చేస్తున్నారు. 





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>