PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-zptc-mptc-elections-202181aa7601-0217-43f7-9b09-152ecd72b859-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-zptc-mptc-elections-202181aa7601-0217-43f7-9b09-152ecd72b859-415x250-IndiaHerald.jpgనిన్న మధ్యాహ్నం వరకు అసలు జరుగుతాయా లేదా అన్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కొద్దిసేపటి క్రితం మొదలయ్యాయి.. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 515 జడ్పీటీసీలు, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో 126 జెడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జడ్పీటీసీ బరిలో 2058 మంది అభ్యర్థులు నిలబడ్డారు. అలాగే ఎంపీటీసీ బరిలో 18782 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 27 వేల 751 పోలింగ్ కేంద్రాలు ఏరap-zptc-mptc-elections-2021;godavari river;andhra pradesh;janasena;district;east;kadapa;telugu;east godavari;police;king;bike;tdp;ycp;janasena party;reddy;petta;gharshanaఏపీ పరిషత్ ఎన్నికలు : పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు !ఏపీ పరిషత్ ఎన్నికలు : పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు !ap-zptc-mptc-elections-2021;godavari river;andhra pradesh;janasena;district;east;kadapa;telugu;east godavari;police;king;bike;tdp;ycp;janasena party;reddy;petta;gharshanaThu, 08 Apr 2021 11:00:00 GMTనిన్న మధ్యాహ్నం వరకు అసలు జరుగుతాయా లేదా అన్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కొద్దిసేపటి క్రితం మొదలయ్యాయి.. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 515 జడ్పీటీసీలు, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో 126 జెడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జడ్పీటీసీ బరిలో 2058 మంది అభ్యర్థులు నిలబడ్డారు. అలాగే ఎంపీటీసీ బరిలో 18782 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 27 వేల 751 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటు హక్కు వినియోగించుకునే వోటర్ల సంఖ్య రెండు కోట్ల నలభై ఏడు లక్షలు గా ఉంది. 

ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా కడప జిల్లా విషయానికి వస్తే చాపాడు మండలం రాజు వారి పేట లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ బూత్ లోపలికి తమ ఏజెంట్ను పంపాలని టీడీపీ నిరసన వ్యక్తం చేస్తోంది.  తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే రెండు మూడు చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందుగా కిర్లంపూడి మండలం కృష్ణాపురం విషయానికొస్తే ఇక్కడ వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ నాయకుల మీద టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో టీడీపీ నేతలు ఇంటి మీద వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, బైక్ ధ్వంసం అయినట్లుగా తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు.. ఇక మరో పక్క తూర్పు గోదావరి జిల్లాలోనే మామిడికుదురు మండలం సత్తెమ్మపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. నలుగురు వైసీపీ కార్యకర్తల కు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. జనసేన కార్యకర్తలు డబ్బు పంచడానికి వస్తే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని సమన్యాయం అంటూ జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. తమ మీద రాళ్ల దాడి చేశారని వైసీపీ ప్రధాన ఆరోపణ. గుంటూరు జిల్లా విషయానికొస్తే రాజుపాలెం మండలం రెడ్డి గూడెంలో కూడా ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి..

అయితే ఏ పార్టీకి చెందిన వారు అనే అంశం బయటికి రాలేదు. ఎన్నికల విషయంలో డబ్బు పంపిణీ నేపథ్యంలోనే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల వాళ్ళు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక గుంటూరు జిల్లాలోనే గోపు వారి పాలెం లో వైసీపీ నేతలు తమను లోపలకు పంపించడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. టిడిపి ఏజెంట్ గా ఉన్న వారిని సైతం లోపలికి పంపడం లేదని వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ కి ఐకాన్ స్టార్ బిరుదు ఇవ్వడం కరెక్టేనా..!!

ఆచార్య ను సస్పెన్స్ లో పెట్టిన పవన్ !

సరిలేరు నీకెవ్వరు సినిమాలో.. పక్కింటి కుర్రాడు రెమ్యూనరేషన్ గురించి అసలు విషయం చెప్పేసాడు..?

హ‌డ‌లిపోతున్న వైసీపీ నేత‌లు.. రీజ‌నేంటి ?

జగన్ తిరుపతి ప్రచారం వెనక మాస్టర్ ప్లాన్...?

దేశంలో క‌రోనా విల‌యం..మ‌హ‌మ్మారి బారిన అన్ని వేల‌మంది చిన్నారులు

పవన్ మౌనం పై అంజలి షాకింగ్ కామెంట్స్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>