Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/mumbai-indians3b8ac37d-5e64-488d-90b7-6f869f417175-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/mumbai-indians3b8ac37d-5e64-488d-90b7-6f869f417175-415x250-IndiaHerald.jpg ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. కాగా.. ఈ ఏడాది టోర్నీ కోసం అన్ని జట్లూ స్టార్ ఆటగాళ్లలో కోట్లు పోసి మరీ కొనుగోలు చేశాయి. దీంతో ఈ ఏడాది ఏ జట్టు ట్రోఫీ గెలుస్తుందని..mumbai indians;mumbai;virat kohli;twitter;bengaluru 1;chennai;winner;winner1;april;indian‘విన్నర్ ముంబై.. మిస్ అయితే ఎవరంటే..’‘విన్నర్ ముంబై.. మిస్ అయితే ఎవరంటే..’mumbai indians;mumbai;virat kohli;twitter;bengaluru 1;chennai;winner;winner1;april;indianThu, 08 Apr 2021 18:52:48 GMTఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. కాగా.. ఈ ఏడాది టోర్నీ కోసం అన్ని జట్లూ స్టార్ ఆటగాళ్లలో కోట్లు పోసి మరీ కొనుగోలు చేశాయి. దీంతో ఈ ఏడాది ఏ జట్టు ట్రోఫీ గెలుస్తుందని చెప్పడం మరింత కష్టమైంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ విజేతగా ఎవరు నిలుస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ ఆటగాళ్ల మధ్య కూడా ఈ విషయంలో భారీ చర్చలు జరుగుతున్నాయి. విశ్లేషకులు కూడా ప్రతి జట్టులో ఉన్న అన్ని విభాగాలనూ పరిశీలిస్తూ అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ట్విటర్ వేదికగా ఐపీఎల్‌పై తన అంచనాలను చెప్పాడు.

సీజన్ ఇంకా ప్రారంభం కూడా కాకముందే టైటిల్ గెలిచే జట్టేదో అంచనా వేశాడు. ఈ ఏడాది టైటిల్‌ను కూడా ముంబై ఎగరేసుకుపోతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని వాన్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ ట్రోఫీ కూడా ముంబైదే. వరుస సిక్సర్ కొడుతుంది. అలా కాకుండా ముంబై టైటిల్ చేజార్చుకోవాలంటే ఏదో అద్భుతం జరగాల్సిందే. ఒకవేళ కప్పు ముంబైకి దక్కకుంటే.. ఆ తరువాతి వరుసలో కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఉంటుంది. మరే జట్టుకూ ఆ సత్తా లేదు’ అంటూ వాన్ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే వాన్‌ అంచనాలను ఇతర జట్ల అభిమానులు తిరస్కరిస్తున్నారు. మరి కొందరు వాన్ ప్రెడిక్షన్‌పై మండిపడుతున్నారు. ‘అన్నీ నువ్వే డిసైడ్‌ చేస్తే, ఇన్ని జట్లు ఆడటం ఎందుకం’టూ ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠను కలిగిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సన్‌రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా కోల్‌కతాతో ఆడనుంది. ఇక ఏప్రిల్‌ 17న, మే 4న ముంబై, హైదరాబాద్‌ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.
">






ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నన్నే సీఎం కావాలంటున్నారు.. తిరుపతిలో చంద్రబాబు కామెంట్స్

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>