ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pregnancyad157ad9-c35b-4049-831c-07720d7b25c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pregnancyad157ad9-c35b-4049-831c-07720d7b25c2-415x250-IndiaHerald.jpgమన చుట్టూనే ఎన్నో వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అదే కోణంలో మరో ఘటన చోటు చేసుకుంది. తనకు తెలియకుండానే ఓ మహిళ గర్భం దాల్చింది. అంతేకాదు.. తనకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చే వరకు కూడా ఆమెకు గర్భందాల్చిన సంగతి తెలీదు.pregnancy;women;media;husband;woman;v;paruguవింత: గర్భందాల్చిన విషయం తెలియకుండానే.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..!వింత: గర్భందాల్చిన విషయం తెలియకుండానే.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..!pregnancy;women;media;husband;woman;v;paruguThu, 08 Apr 2021 10:01:16 GMTమన చుట్టూనే ఎన్నో వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అదే కోణంలో మరో ఘటన చోటు చేసుకుంది. తనకు తెలియకుండానే ఓ మహిళ గర్భం దాల్చింది. అంతేకాదు.. తనకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చే వరకు కూడా ఆమెకు గర్భందాల్చిన సంగతి తెలీదు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని బోస్టన్ నగరానికి చెందిన 38 ఏళ్ల మెలిస్సా సర్జ్‌కాఫ్‌కు గతనెల 8న తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.

అయితే కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పిగా సర్జ్‌కాఫ్ భావించి వెంటనే బాత్రూంలోకి పరుగులు తీసింది. అనంతరం బాత్రూంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చి షాక్‌కు గురైంది. తాను గర్భందాల్చిన విషయం కూడా తనకు తెలియదని ఆమె చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఖంగుతున్నారు. కొన్ని నెలలుగా రుతుస్రావం కాకపోయినప్పటికీ.. పొట్ట పరిమాణం మాత్రం సాధారణంగానే ఉండటంతో తాను ప్రెగ్నెంట్ అయినట్లే లేదని మెలిస్సా చెప్పారు.

ఇదే సమయంలో గత నెల 8న అకస్మాత్తుగా వచ్చిన నొప్పులను పురుటి నొప్పులుగా గ్రహించలేకపోయానని ఆమె తెలిపారు. కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పులుగా భావించానని.. అయితే జననాంగాల నుంచి రక్తం రావడాన్ని చూసి.. పీరియడ్స్ కారణంగా వచ్చే నొప్పులుగా అంచనా వేసినట్టు సర్జ్‌కాఫ్ పేర్కొన్నారు. బాత్‌రూంలోకి పరిగెత్తగా.. జననాంగాల నుంచి రక్తంతోపాటు మాంసం ముద్ద కూడా రావడాన్ని చూసి.. ఏదో అవయం తన శరీరం నుంచి బయటికి వస్తోందని భ్రమపడ్డానని చెప్పారు.

చివరికి తన భర్త డొనాల్డ్ క్యాంప్‌బెలే.. అసలు విషయం చెప్పాడని మెలిస్సా వెల్లడించారు. గట్టిగా అరవడంతో బాత్రూంలోకి వచ్చిన డొనాల్డ్ క్యాంప్.. తాను మగబిడ్డకు జన్మనిచ్చినట్టు చెప్పాడంతో తాను షాక్‌కు గురయ్యానని ఆమె పేర్కొన్నారు. డాక్టర్లు సైతం ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. కాగా, బ్రెజిల్‌కు చెందిన ఏళ్ల మహిళ, బ్రిటన్‌కు చెందిన 32 ఏళ్ల మరో మహిళ కూడా ఇదే విధంగా ప్రసవించారంటూ ఇటీవల కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ ఇరుక్కున్నారా...?

బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

శ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..

చిరంజీవిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>