CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/kshudracaf1aaea-5d4c-4e05-b16b-040cfd860b83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/kshudracaf1aaea-5d4c-4e05-b16b-040cfd860b83-415x250-IndiaHerald.jpgదేశంలో ఇంకా మూఢ న‌మ్మ‌కాలు బ‌లంగా వేళ్లూనుకునే ఉన్నాయ‌ని ధ్రువీక‌రించే ఘ‌ట‌న ఇది. చ‌నిపోయిన మ‌నిషిని బ‌తికిస్తాన‌ని ఓ క్షుద్ర మాంత్రికుడు జ‌నాల‌ను చాలాసేపు న‌మ్మించ‌గ‌లిగాడు. అయితే అక్క‌డి విద్యావంతులు విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో మాంత్రికుడిని జైలుకు పంపారు. నయాగఢ్‌ జిల్లాలోని బార్సాహీ అనే కుగ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇంటికి తీkshudra;district;police;village;arrest;aqua;local language;medak;veldurthi;narasimhaశ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..శ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..kshudra;district;police;village;arrest;aqua;local language;medak;veldurthi;narasimhaThu, 08 Apr 2021 09:10:00 GMTదేశంలో ఇంకా మూఢ న‌మ్మ‌కాలు బ‌లంగా వేళ్లూనుకునే ఉన్నాయ‌ని ధ్రువీక‌రించే ఘ‌ట‌న ఇది. చ‌నిపోయిన మ‌నిషిని బ‌తికిస్తాన‌ని ఓ క్షుద్ర మాంత్రికుడు జ‌నాల‌ను చాలాసేపు న‌మ్మించ‌గ‌లిగాడు. అయితే అక్క‌డి విద్యావంతులు విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో మాంత్రికుడిని జైలుకు పంపారు. నయాగఢ్‌ జిల్లాలోని బార్సాహీ అనే కుగ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా... ఎవరో కొంతమంది వ్యక్తులు ఓ క్షుద్ర మాంత్రికుడి గురించి వారితో చెప్పారు. అతన్ని సంప్రదిస్తే చనిపోయిన వ్యక్తిని బతికిస్తాడని నమ్మబలికారు.


ఆ మాటలు నమ్మిన మృతుడి కుటుంబం ఆ మాంత్రికుడిని పిలిపించింది. దీంతో ఆ ఇంటికి వచ్చిన మాంత్రికుడు... మృతుడి శవానికి క్షుద్ర పూజలు చేశాడు. మృతదేహాన్ని ఇంటి బయట నేలపై ఉంచిన మాయగాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేయాలో అన్నీ చేశారు. శవంపై సలసల కాగే నీటిని కుండలకొద్దీ పోశారు. ఆ తర్వాత గుండెను బలంగా నొక్కారు. ఇలా అనేక ఫీట్లు చేశారు. చనిపోయిన వ్యక్తి ఎలా బతుకుతాడో అనే చోద్యాన్ని గూడెం ప్రజలంతా గుడ్లప్పగించి చూశారు. గంటలు గడుస్తున్నా శవంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. అక్క‌డున్న విద్యావంతుల పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో జైలుకు త‌ర‌లించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


ఇదిలా ఉండ‌గా మ‌రో సంఘ‌ట‌న‌లో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్‌పూర్‌తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో నూనావత్ కిషన్ అనే వ్యక్తిపై స్థానికుడు నరసింహ కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాల పాలైన కిషన్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడు నరసింహను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>