PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ నేతలు ఇప్పుడు చాలా సీరియస్ గా విమర్శలు చేస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో వైసీపీ బలంగా ఉండటంతో జనసేన నేతలు కాస్త ఎక్కువగా కష్టపడే పరిస్థితి వచ్చింది అనే మాట వాస్తవం. ఇక ఇదిలా ఉంటే జనసేన నేతలపై దాడుల గురించి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటనచేసారు. ఎన్నికల్లో బలమైన పోటీగా నిలిచారనే రాజకీయ కక్షతో జనసేన నాయకులు, మహిళ కార్యకర్తలపై అధికార పక్షంవnadendla;madhusudhan;jagan;nadendla manohar;andhra pradesh;janasena;district;scheduled caste;police;village;woman;ycp;janasena party;reddy;partyజగన్ పై చెలరేగిపోయిన నాదెండ్ల...!జగన్ పై చెలరేగిపోయిన నాదెండ్ల...!nadendla;madhusudhan;jagan;nadendla manohar;andhra pradesh;janasena;district;scheduled caste;police;village;woman;ycp;janasena party;reddy;partyThu, 08 Apr 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ నేతలు ఇప్పుడు చాలా సీరియస్ గా విమర్శలు చేస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో  వైసీపీ బలంగా ఉండటంతో జనసేన నేతలు కాస్త ఎక్కువగా కష్టపడే పరిస్థితి వచ్చింది అనే మాట వాస్తవం. ఇక ఇదిలా ఉంటే జనసేన నేతలపై దాడుల గురించి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్  ప్రకటనచేసారు. ఎన్నికల్లో బలమైన పోటీగా నిలిచారనే రాజకీయ కక్షతో జనసేన నాయకులు, మహిళ కార్యకర్తలపై అధికార పక్షంవాళ్లు దాడులకు, బెదిరింపులకు పాల్పడటం అత్యంత హేయకరమైన చర్య అని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగం. తమకు ఎదురే నిలబడకూడదనే వైసీపీ వాళ్ళ ధోరణి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది అని వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని రేగాటిపల్లిలో మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గం దాడికి పాల్పడ్డ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఆ గ్రామంలో శ్రీమతి చిలకం ఛాయాదేవి గారు ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరిస్తుంటే అధికార పార్టీ బెదిరింపులకు దిగుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఎస్సీ వర్గానికి చెందినవారిని దుర్భాషలాడి, దాడి చేయడం వైసీపీ అధికార అహంకారాన్ని తెలుపుతుంది అని విమర్శలు చేసారు.

ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది అని, ఆ దిశగా పోలీసు అధికారులు ఈ దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. చట్టానికి అనుగుణంగా పని చేసి ఎన్నికల సమయంలో పోలీసులు అధికార పక్షానికి అండగా నిలుస్తున్నారనే అపప్రధను తొలగించుకోవాలి అని సూచించారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ హడావిడిగా, తప్పుల తడకగా నిర్వర్తిస్తోంది అని విమర్శించారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల రాకతో మారుతున్న మత రాజకీయాలు..!!

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>