CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/phone-hacking-minor-e-mail-ciber-crime675b2162-bba2-4541-998a-ba0fa754f4e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/phone-hacking-minor-e-mail-ciber-crime675b2162-bba2-4541-998a-ba0fa754f4e9-415x250-IndiaHerald.jpgటెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని సంతోషపడాలో లేదంటే అదే టెక్నాలజీ వలన యూత్ తప్పు దోవ పడుతున్నారని బాధ పడాలో అర్ధం కావడం లేదు. ఎన్నో తెలివితేటలూ ఉన్న యూత్ వాళ్ళ తెలివిని చూపించవలిసిన వాటి మీద కాకుండా చేయకూడని పనులు మీద చూపిస్తున్నారు. ఇలా చెడ్డ పనులు చేయడం వలన ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు చివరాఖరికి జైలు పాలు అవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కుర్రవాడు పైకి చూస్తే మైనరే. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఒక యువతికి సహాయం చేస్తున్నట్లు నమ్మించి మోసం చేసాడphone, hacking, minor, e mail, ciber crime;technology;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;police;facebook;allu snehaచూడడానికి మైనర్... కానీ ఈ కుర్రాడు యమా డేంజర్.. !!చూడడానికి మైనర్... కానీ ఈ కుర్రాడు యమా డేంజర్.. !!phone, hacking, minor, e mail, ciber crime;technology;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;police;facebook;allu snehaThu, 08 Apr 2021 13:30:00 GMTటెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని సంతోషపడాలో లేదంటే అదే టెక్నాలజీ వలన యూత్ తప్పు దోవ పడుతున్నారని బాధ పడాలో అర్ధం కావడం లేదు. ఎన్నో తెలివితేటలూ ఉన్న యూత్ వాళ్ళ తెలివిని చూపించవలిసిన వాటి మీద కాకుండా చేయకూడని పనులు మీద చూపిస్తున్నారు. ఇలా చెడ్డ పనులు చేయడం వలన ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు చివరాఖరికి జైలు పాలు అవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కుర్రవాడు పైకి చూస్తే మైనరే. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఒక యువతికి సహాయం చేస్తున్నట్లు నమ్మించి మోసం చేసాడు. తాను నమ్మిన కుర్రవాడే మోసగాడు అని తెలియకపోవడంతో ఆ యువతికి చుక్కలు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు ‘మైనర్‌’ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు.



పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సిటీకి చెందిన ఓ యువతి మెడిసిన్ చదువుతుంది. ఆమెకు చెందిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. వాటిని పరిష్కరించడంతో పాటు తొలగించడం కోసం ఆమె తన పక్కింట్లో ఉండే ఓ బాలుడి సహాయం తీసుకున్నది.  అతడు ఈ యువతితో స్నేహంగా, ఆత్మీయంగా ఉంటూనే  తన ఈ– మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తదితరాలను సంగ్రహించాడు. అదను చూసుకుని ఆమె మెయిల్‌ ఐడీని యాక్సెస్‌ చేశాడు.  దాని ద్వారా ఆమె ఆన్‌లైన్‌ క్లాసుల్లోకి అక్రమంగా ప్రవేశించి  ఆ క్లాసుల్లో ఆమె పోస్టు చేస్తున్నట్లు అసభ్య, అశ్లీల ఫొటోలు షేర్‌ చేసేవాడు. ఆ మెయిల్‌లో ఆమె సేవ్‌ చేసుకున్న ఫొటోలను తన అధీనంలోకి తీసుకున్నాడు. తన వద్ద ఉన్న మెయిల్‌ వివరాల ఆధారంగా వారి ఇంటి వైఫై కనెక్షన్‌ను యాక్సెస్‌ చేసి ఫోన్లు కూడా హ్యాంగ్‌ అయ్యేలా చేశాడు. ఇలా వాటిని గుర్తుతెలియని వ్యక్తి హ్యాక్‌ చేసిన భావనను ఆ యువతిలోను, కుటుంబ సభ్యులలోను  కలిగించాడు.


 బాధితురాలి ఫేస్‌బుక్‌ ఖాతాను యాక్సెస్‌ చేసిన బాలుడు అందులో ఆమె చేసినట్లు అశ్లీల ఫొటోలు పోస్టు చేశాడు. ఆమెతో పాటు వారి కుటుంబికుల దైనందిన జీవితాలను కూడా తన చెప్పు చేతలలో పెట్టుకున్నాడు. ఈ పనులు చేస్తూ తనలో తాను వికృతానందం పొందేవాడు. కొన్ని సందర్భాల్లో నిజం తెలియని బాధితురాలు ఈ బాలుడి వద్దకే వచ్చి విషయం చెప్పేది. తన ఫేస్‌బుక్‌ ఖాతా బ్లాక్‌ చేయాలని కోరేది. ఆమె ముందు అలాగే చేసిన మైనర్‌ ఆ తర్వాత యాక్టివ్‌ చేసే వాడు. ఇంకా విసిగిపోయిన  బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు పూర్వాపరాలు పరిశీలించి, దర్యాప్తు చేసి యువతి పక్కింటి బాలుడే బాధ్యుడని తేల్చారు. అతడిని పట్టుకుని న్యాయస్థానం ఆదేశాల మేరకు అబ్జర్వేషన్‌ హోమ్‌కు తరలించారు.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పరిషత్ ఎన్నికలు : ఓటేసిన ఉప ముఖ్యమంత్రి, స్పీకర్..

సోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?

ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడి మేకోవర్ ఈ రేంజ్ లో ఉందా..!!

కాంగ్రెస్ లో రాహుల్ ని వాడుకోలేకపోతున్నారా...?

మూవీ టికెట్స్ విషయంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

పవన్ ని వాడుకోలేకపోతున్న బిజెపి...?

ఆర్జీవీ బర్త్ డే.. హైదరాబాద్ పబ్ లో రచ్చ రచ్చ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>