PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paripurnanda-swamy-ttdf81a4d06-9bc4-4dd5-bcb6-63e86a8ad16b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paripurnanda-swamy-ttdf81a4d06-9bc4-4dd5-bcb6-63e86a8ad16b-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రిని విష్ణుమూర్తితో పోల్చడం జగన్‌కే ప్రమాదమన్నారు పరిపూర్ణానంద స్వామి. విష్ణు అనుగ్రహంతో రాజయోగం ఉంటుందని.. రాజునే విష్ణువుగా పోల్చకూడదని చెప్పారు. వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామికి చేసినట్లు జగన్‌కూ పూజలు చేస్తారా? అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. paripurnanda swamy ttd;deva;ramana;tiru;vishnu;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;tirupati;cm;chief minister;king;husband;aqua;tdp;ycp;hindus;party;tirumala tirupathi devasthanamసీఎం జగన్ పై పరిపూర్ణానంద ఫైర్సీఎం జగన్ పై పరిపూర్ణానంద ఫైర్paripurnanda swamy ttd;deva;ramana;tiru;vishnu;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;tirupati;cm;chief minister;king;husband;aqua;tdp;ycp;hindus;party;tirumala tirupathi devasthanamThu, 08 Apr 2021 19:21:37 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోల్చుతూ టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులుగా ఇటీవలే తిరిగి నియమితులైన   రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రమణ దీక్షితులు వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నేతలతో పాటు హిందుత్వ సంఘాలు, స్వామిజీలు మండిపడుతున్నారు. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. టీటీడీ బోర్డు రాజకీయాలకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రిని విష్ణుమూర్తితో పోల్చడం జగన్‌కే ప్రమాదమన్నారు పరిపూర్ణానంద స్వామి. విష్ణు అనుగ్రహంతో రాజయోగం ఉంటుందని.. రాజునే విష్ణువుగా పోల్చకూడదని చెప్పారు. వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామికి చేసినట్లు జగన్‌కూ పూజలు చేస్తారా? అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణదీక్షితుల వ్యాఖ్యలను సీఎంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఖండించాలన్నారు. పింక్‌ డైమండ్‌ ఏమైందని.. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు దానికి ప్రస్తావన రావడం లేదని ఆయన నిలదీశారు.

తిరుపతి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పరిపూర్ణానంద స్వామి సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తున్న సీఎం జగన్ కు ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రెండేళ్లుగా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని.. ఆలయాల కూల్చివేతలపై స్పందించడం లేదెందుకని నిలదీశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరారు పరిపూర్ణానంద స్వామి. తిరుపతిలో బీజేపీ గెలిస్తేనే ఆలయాలపై జరుగుతున్న దాడులు ఆగిపోతాయన్నారు పరిపూర్ణానంద స్వామి.

గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అదినేత చంద్రబాబు కూడా మ‌నుషుల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం స‌రికాద‌ని చెప్పారు మ‌నిషి ఎప్పుడూ దేవుడు కాలేడ‌ని, మ‌నిషి మ‌నిషేన‌ని, దేవుడు దేవుడేన‌ని వ్యాఖ్యానించారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని తెలిపారు. కోట్ల మంది మ‌నోభావాల‌కు సంబంధించిన అంశాల‌పై బాధ్య‌త‌గా ఉండాల‌ని చెప్పారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల రాకతో మారుతున్న మత రాజకీయాలు..!!

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>