MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulirrr-7e8353dd-ca73-484d-becc-343bb5b547d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulirrr-7e8353dd-ca73-484d-becc-343bb5b547d3-415x250-IndiaHerald.jpgకరోనా లాక్ డౌన్ తరువాత సినిమాల రిలీజ్ మొదలైనప్పటికీ ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ఒక్క సినిమా కూడ విడుదల కాలేదు. దీనితో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి తిరిగి పూర్వ వైభవం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల తరువాత మాత్రమే వస్తుంది అంటూ ఈ మూవీ పై రోజురోజుకు అంచనాలు పెంచేస్తున్నారు.దీనికి తగ్గట్టుగానే ఈమూవీ పై బయ్యర్లలో మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో ఈ మూవీ విడుదల కాకుండానే 450 కోట్ల నికర లాభం ఆర్జించింది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న వార్తలను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశrajamoulirrr;;business;rrr movie;cinema;cinema theater;film industry;industry;indianఆర్ ఆర్ ఆర్ మితిమీరిన ఆత్మవిశ్వాసం పై చర్చలు !ఆర్ ఆర్ ఆర్ మితిమీరిన ఆత్మవిశ్వాసం పై చర్చలు !rajamoulirrr;;business;rrr movie;cinema;cinema theater;film industry;industry;indianWed, 07 Apr 2021 10:00:00 GMTకరోనా లాక్ డౌన్ తరువాత సినిమాల రిలీజ్ మొదలైనప్పటికీ ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ఒక్క సినిమా కూడ విడుదల కాలేదు. దీనితో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి తిరిగి పూర్వ వైభవం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల తరువాత మాత్రమే వస్తుంది అంటూ ఈ మూవీ పై రోజురోజుకు అంచనాలు పెంచేస్తున్నారు.


దీనికి తగ్గట్టుగానే ఈమూవీ పై బయ్యర్లలో మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో ఈ మూవీ విడుదల కాకుండానే 450 కోట్ల నికర లాభం ఆర్జించింది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న వార్తలను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆ మూవీ నిర్మాతలకు 20 కోట్లు లాభం రావడం చాల కష్టమైన పని.


ఈ సినిమాకు నాన్ థియేటర్ హక్కులు డిజిటల్ హక్కులను టోకున 400 కోట్లకు కాస్త ఇటు అటుగా ఇప్పటికే విక్రయించేసారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు ఈ మూవీని డబ్ చేసి ప్రపంచంలోని అనేక భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈమూవీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ కూడ వందల కోట్లలలో అమ్మకం జరుగుతున్నట్లు టాక్. ఇలా ఈమూవీకి సంబంధించిన బిజినెస్ ను లెక్కలోకి తీసుకుంటే సుమారు 8 వందల కోట్ల వరకు ఉంటుంది అని అంటున్నారు.


దీనితో ఈసినిమాకు అన్ని ఖర్చులు పోను హీరోలు ఇధ్దరికి చెరో 35 కోట్ల పారితోషికాలు ఇతర నటీనటులకు ఇచ్చే పారితోషికాలు టెక్నిషియన్స్ కు ఇచ్చే పారితోషికాలు అదనపు ఖర్చులు వడ్డీలు అన్నీ కలుపుకున్నా ఈమూవీ దర్శక నిర్మాతలు ఇద్దరికీ చెరో రెండు వందల కోట్లు మిగులుతాయి అంటూ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ఫిగర్స్ అన్నీ వినడానికి చాల బాగున్నా ఈ మూవీ నిర్మాతల మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు..






ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!

నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>