PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tripura-cm-tested-covid-positivecb4291a1-e0fb-4d2c-ac8c-13dcc7fbfdba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tripura-cm-tested-covid-positivecb4291a1-e0fb-4d2c-ac8c-13dcc7fbfdba-415x250-IndiaHerald.jpgత్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయనే వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. tripura cm tested covid positive;kumaar;rakshita;delhi;maharashtra - mumbai;capital;chief minister;job;car;maharashtra;letter;house;punjab;kavacham;coronavirus;panjaaత్రిపుర ముఖ్యమంత్రికి కరోనాత్రిపుర ముఖ్యమంత్రికి కరోనాtripura cm tested covid positive;kumaar;rakshita;delhi;maharashtra - mumbai;capital;chief minister;job;car;maharashtra;letter;house;punjab;kavacham;coronavirus;panjaaWed, 07 Apr 2021 13:47:57 GMTదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏకంగా 630 మంది మృతి చెందారు. ఒక్క రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే రికార్డు. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్ లో కరోనా తీవ్రత అత్యంత దారుణంగా తయారైంది. బెంగళూరు, ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయనే  వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు బిప్లవ్ దేవ్ కుమార్ తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.

కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీ హైకోర్టు కరోనా కట్టడికి పలు సూచనలు చేసింది. మాస్క్‌ను సురక్షణ కవచంగా పేర్కొంటూ, ఎవరైనా సరే కారులో ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ వారు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. మాస్క్ అనేది కోవిడ్-19 వైరస్‌ను అడ్డుకుంటుందని తెలిపింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్‌కర్ఫ్యూను విధించింది. కరోనా వైరస్ చైన్ తెగ్గొట్టేందుకు నైట్ కర్ఫ్యూ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  ఢిల్లీలో మాస్క్ పెట్టుకోని వారి నుంచి రెండు వేల రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు.  

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరోమారు ఓపీడీ సేవలను గురువారం నుంచి నిలిపివేయనున్నారు. దీంతో ఇకపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను మాత్రమే స్వీకరించనున్నారు. ఇలా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులనే ఎయిమ్స్ వైద్యులు పరీక్షించనున్నారు. ఇదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులను మాత్రమే ఎయిమ్స్‌లోకి అనుమతించనున్నారు. ఇంతేకాదు ఎయిమ్స్‌లోని అన్ని విభాగాలలోను రోజుకు 50 రిజిస్ట్రేషన్లను మాత్రమే స్వీకరించనున్నారు



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నాలుగూ చోట్ల వైసీపీకి దెబ్బ ?

మరో సుకుమార్ శిష్యుడితో సాయి ధరమ్ తేజ్ ?

అసలు వర్మ డైరెక్టర్ ఎలా అయ్యాడు అనిపించే సినిమాలు.!!

పుష్ప ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది ??

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>