MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/corona-effects-tollywood2b248ac5-e109-4160-b515-ab067a346035-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/corona-effects-tollywood2b248ac5-e109-4160-b515-ab067a346035-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చూస్తే బ్యాక్ టు గోల్డెన్ డేస్ అంటోంది కరోనా సెకండ్ వేవ్. ఒకప్పట్లో ఓ సినిమాకి 365 రోజుల్లో వచ్చే కలెక్షన్స్ ని మూడు నాలుగు రోజుల్లో సంపాందించేయాలని పరుగులు తీస్తున్నారు మన సినిమా దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఈ పద్దతికి కళ్లెం వేసి పాత రోజులను గుర్తు చేసుకొనేలా చేస్తోంది కరోనా వైరస్. CORONA-EFFECTS-TOLLYWOOD;audi;jagan;andhra pradesh;industries;cinema;industry;maha;coronavirus;paruguకరోనా వల్ల సినిమా పరిశ్రమ కష్టాలు ఇంకెన్నాళ్లు...?కరోనా వల్ల సినిమా పరిశ్రమ కష్టాలు ఇంకెన్నాళ్లు...?CORONA-EFFECTS-TOLLYWOOD;audi;jagan;andhra pradesh;industries;cinema;industry;maha;coronavirus;paruguWed, 07 Apr 2021 18:00:00 GMTప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చూస్తే బ్యాక్ టు గోల్డెన్ డేస్ అంటోంది కరోనా సెకండ్ వేవ్. ఒకప్పట్లో ఓ సినిమాకి 365 రోజుల్లో వచ్చే కలెక్షన్స్ ని మూడు నాలుగు రోజుల్లో సంపాందించేయాలని పరుగులు తీస్తున్నారు మన సినిమా దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఈ పద్దతికి కళ్లెం వేసి పాత రోజులను గుర్తు చేసుకొనేలా చేస్తోంది కరోనా వైరస్. చైనా నుండి ఊడిపడ్డ ఈ మహమ్మారి ఏడాది దాటినా ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లనంటోంది. అలా కొద్ది రోజులు తగ్గిందని ప్రజలు ఊపిరి పీల్చుకునేలోపు మళ్ళీ విజృంభిస్తూ అందరినీ బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమను టార్గెట్ చేసినట్లుగా విరుచుకుపడుతోంది ఈ మహమ్మారి.

క్లాసిక్ డేస్ సినిమాలు 365 రోజులు ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా బాగుంటే అంతగా ఆదరించే వాళ్ళు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు సినిమా ఎంత బాగున్నా  అన్ని రోజులు  ఆడిన దాఖలాలు లేవు. ఎంత పవర్ఫుల్ స్టోరీ అయినా 100 లేదా 150 రోజులు ఆడుతున్నాయి. ఇక మిగిలిన వాటి సంగతి చెప్పనక్కర్లేదు మహా అయితే 50 రోజులు ఎక్కువ. ఇవన్నీ కాలంతో పాటే మార్పులొచ్చాయి..కాల క్రమేణా ఇవి తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుత జనరేషన్ లో మహా అయితే మూడు నాలుగు రోజుల్లోనే 100 కోట్లు వసూళ్లు చేయాలన్న టార్గెట్ మొదలయ్యాక 100 రోజులు సినిమా  ఆడే అవకాశమే లేకుండా పోతోంది. ఇలా వేగంగా వసూళ్లు ఆర్జించాలన్న ఆకాంక్షకు కరోనా ఆడ్డుకట్ట వేస్తోంది. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి చెల్లు చీటి ఇచ్చి 50 శాతానికి పరిమితం చేస్తోంది.

ప్రభుత్వాలు ఎంతో ఉదారంగా వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చినా మహమ్మారీ అయితే కనికరించడం లేదు. ఇదంతా చూస్తుంటే ఏపీ సీఎం జగన్ చెప్పినట్లు జీవితాంతం కరోనాతో సహజీవనం తప్పేలా లేదు.  అంటువ్యాధి అయిన కరోనా ఇప్పుడప్పుడే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లే దాఖలాలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిని అర్ధం చేసుకున్న ఇండస్ట్రీ వర్గాలు  మూడు నాలుగు రోజుల్లో 100 కోట్ల వసూళ్ల మాట పక్కన పెట్టి..సినిమాను 100 రోజులు ఆడించే దాని మీద దృష్టి పెడితేనే వసూళ్లు వస్తాయి.  అయితే  తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఏమి నిర్ణయించుకోనున్నారో ...? వారి ప్రణాళిక ఏమిటో తెలియాల్సి ఉంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పరాజయం అంటే.. మా జీవితం లోనే లేదు అంటున్న టాప్ డైరెక్టర్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?

వకీల్ సాబ్ లో కోర్టు సీన్లు సినిమాకే పెద్ద హైలైట్ అట....

మరోసారి నాగచైతన్యతో జతకట్టనున్న ఆ హీరోయిన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>