PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mumbai-corona-upadatesff3b6984-afec-4ef6-9d61-591a35c87530-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mumbai-corona-upadatesff3b6984-afec-4ef6-9d61-591a35c87530-415x250-IndiaHerald.jpgలాక్‌డౌన్ పెట్టబోమ‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీ స్వ‌యంగా ప్ర‌క‌టించినా దేశ ప్ర‌జ‌లు మాత్రం న‌మ్మ‌డం లేదు. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా కావాల్సిన వ‌స్తువుల‌ను, ఆహార ప‌దార్థాల‌ను స‌మ‌కూర్చుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రజలు లాక్‌డౌన్ విధిస్తారేమోనన్న భయంతో దుకాణాలు, మాల్స్ ముందు తమకు కావలసిన సరుకులు కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు. ఈ సందర్భంగా దుకాణాల వద్దకు చేరుతున్న పలువురు మాట్లాడుతూ ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే సరుకులు కొనుగోలు చేస్తున్నాcorona;narendra modi;central government;coronavirusలాక్‌డౌన్ భ‌యం..కిట‌కిట‌లాడుతున్న దుకాణాలు..లాక్‌డౌన్ భ‌యం..కిట‌కిట‌లాడుతున్న దుకాణాలు..corona;narendra modi;central government;coronavirusWed, 07 Apr 2021 08:30:00 GMTలాక్‌డౌన్ పెట్టబోమ‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీ స్వ‌యంగా ప్ర‌క‌టించినా దేశ ప్ర‌జ‌లు మాత్రం న‌మ్మ‌డం లేదు. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా కావాల్సిన వ‌స్తువుల‌ను, ఆహార ప‌దార్థాల‌ను స‌మ‌కూర్చుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రజలు లాక్‌డౌన్ విధిస్తారేమోనన్న భయంతో దుకాణాలు, మాల్స్ ముందు తమకు కావలసిన సరుకులు కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు. ఈ సందర్భంగా దుకాణాల వద్దకు చేరుతున్న పలువురు మాట్లాడుతూ ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే సరుకులు కొనుగోలు చేస్తున్నామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు.


దీంతో ప్ర‌భుత్వం ఎంత చెప్పినా ప్ర‌జ‌లు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం.  ఇదిలా ఉండ‌గా గుజరాత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 3,280 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి 2,167 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,348గా ఉంది. కాగా గుజరాత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నందున కొద్ది సమయం పాటు లాక్‌డౌన్ విధించవచ్చని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇదిలా ఉండ‌గాదేశంలో కరోనా వైరస్ గతంలో కంటే వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అయితే కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటమే కరోనా విజృంభణకు కారణమవుతోందని కేంద్రం చెప్పింది. ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరింది.


దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులను కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం మీడియాకు వివరించింది. దేశంలో కరోనా గతంలో కంటే వేగంగా వ్యాప్తిస్తోందని, అందుకే కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపింది. అన్ని రాష్ట్రాలు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతిని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమన్నారు. వచ్చే 4 వారాలు చాలా కీలకమైన సమయమని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలు పాటించాలని సూచించారు. మహారాష్ట్రలోని 30, ఛత్తీస్‌ గఢ్‌ లోని 11, పంజాబ్‌ లోని 9 జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించి రాష్ట్ర యంత్రాంగాలకు తగిన సూచనలు చేస్తాయని వివరించారు.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వంటలక్కకు వ్యాపారం పెట్టిస్తా అంటున్న ఆనంద్ రావు.. డాక్టర్ బాబు ఏం అంటాడో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>