PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indiafffd771b-c553-42f7-be98-360a345eae7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indiafffd771b-c553-42f7-be98-360a345eae7f-415x250-IndiaHerald.jpgప్రపంచంలో భారత్ పరిస్థితి రోజురోజుకూ మెరుగవుతోంది. అన్ని రంగాల్లోనూ చెప్పుకోతగ్గ ప్రగతి సాధిస్తోంది. ఓవైపు కరోనా విజృంభిస్తున్నా భారత్ తన సత్తా చాటుతూనే ఉంది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎంఎఫ్‌ చెబుతున్నది ఇదే. కరోనా కారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదాయాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ మాత్రం దీని నుంచి త్వరగానే కోలుకుందనే చెప్పాలి. ఎందుకంటే.. కరోనా కారణంగా 2020లో భారీగా క్షీణించినా... భారతదేశ జీడీపీ 2021లో 12.5శాతానికి పెరుగుతుందట. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎంఎఫ్ india;pragathi;india;2020;internationalప్రపంచంలోనే ఇండియా బెస్ట్.. ఐఎంఎఫ్‌ చెప్పింది ఇదేనా..?ప్రపంచంలోనే ఇండియా బెస్ట్.. ఐఎంఎఫ్‌ చెప్పింది ఇదేనా..?india;pragathi;india;2020;internationalWed, 07 Apr 2021 08:13:41 GMTప్రపంచంలో భారత్ పరిస్థితి రోజురోజుకూ మెరుగవుతోంది. అన్ని రంగాల్లోనూ చెప్పుకోతగ్గ ప్రగతి సాధిస్తోంది. ఓవైపు కరోనా విజృంభిస్తున్నా భారత్ తన సత్తా చాటుతూనే ఉంది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎంఎఫ్‌ చెబుతున్నది ఇదే. కరోనా కారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదాయాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ మాత్రం దీని నుంచి త్వరగానే కోలుకుందనే చెప్పాలి. ఎందుకంటే.. కరోనా కారణంగా 2020లో భారీగా క్షీణించినా...  భారతదేశ జీడీపీ 2021లో 12.5శాతానికి పెరుగుతుందట.


ఈ విషయాన్ని  అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎంఎఫ్  ప్రకటించింది. భారత వృద్ధి రేటును ఆ సంస్థ  అంచనా వేసింది. కరోనా నేపథ్యంలో 2020లో భారత్‌ జీడీపీ రికార్డు స్ధాయిలో 8శాతం క్షీణించింది. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే.. త్వరలోనే ఇండియా చైనా కంటే మెరుగైన ఆర్థిక ఫలితాలు నమోదు చేస్తుందని ఐఎంఎఫ్‌ చెబుతోంది. 2020 ఏడాదిలో భారత్‌ జీడీపీ రికార్డు స్ధాయిలో 8శాతం క్షీణిస్తే.. చైనా మాత్రం చైనా 2.3శాతం వృద్ది రేటు నమోదు చేసింది. కానీ ఈ సీన్ ఈ ఏడాది రివర్స్ అవుతుందట.


2021లో నమోదవబోయే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎంఎఫ్ తెలిపింది. 2021లో చైనా వృద్ధి రేటు 8.6శాతం పెరిగితే.. ఇండియా మాత్రం గణనీయంగా 12 శాతానికి పైగా వృద్ధి రేటు నమోదు చేయబోతోందట. మరో విషయం ఏంటంటే..
2022లో మాత్రం చైనా పెరుగుదల  5.6 శాతం  మాత్రమే ఉంటుందట.  2022లో భారత్‌ జీడీపీ 6.9శాతం వృద్ధి చెందుతుందని  అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎంఎఫ్ వెల్లడించింది.


2021, 2022లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కూడా తాము అంచనా వేసిన దాని కంటే ఎక్కువే నమోదవుతుందని  అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌  అంటున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2021లో 6శాతం, 2022లో 4.4శాతం నమోదు కావచ్చని ఆయన చెబుతున్నారు. మొత్తానికి ఇండియా అన్ని దేశాల కంటే మంచి గణాంకాలే నమోదు చేస్తుందన్నమాట.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వంటలక్కకు వ్యాపారం పెట్టిస్తా అంటున్న ఆనంద్ రావు.. డాక్టర్ బాబు ఏం అంటాడో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>