PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-target-caste-formula6109d75a-de08-4182-8d09-19ef6b06a50b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-target-caste-formula6109d75a-de08-4182-8d09-19ef6b06a50b-415x250-IndiaHerald.jpgదేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్న తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం వరించేది డీఎంకే నే అని ఇప్పటికే జోరుగా ప్రచారాలు ఊపందుకున్నాయి. మరో వైపు సర్వే ఫలితాలు కూడా ఈ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మన భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలోని రాజకీయాలు కేవలం కొన్ని కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. BJP-TARGET-CASTE FORMULA;amala akkineni;tiru;bharatiya janata party;andhra pradesh;rbi;district;assembly;survey;tamilnadu;success;ycp;party"కుల సమీకరణం" ఎన్నికలలో బీజేపీకి ప్లస్ అవుతుందా...?"కుల సమీకరణం" ఎన్నికలలో బీజేపీకి ప్లస్ అవుతుందా...?BJP-TARGET-CASTE FORMULA;amala akkineni;tiru;bharatiya janata party;andhra pradesh;rbi;district;assembly;survey;tamilnadu;success;ycp;partyWed, 07 Apr 2021 14:00:00 GMTదేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్న తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం వరించేది డీఎంకే నే అని ఇప్పటికే జోరుగా ప్రచారాలు ఊపందుకున్నాయి. మరో వైపు సర్వే ఫలితాలు కూడా ఈ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మన భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలోని రాజకీయాలు కేవలం కొన్ని కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద పదవులు సైతం కొన్ని కులాల వారికే పరిమితం అయ్యాయి. మిగిలిన కులాలు అన్నీ కూడా కేవలం అటువంటి వారిని గెలిపించే ఓటు బ్యాంకుగానే మిగిలిపోయాయి. కానీ ప్రస్తుతమున్న బీజేపీ పార్టీ ఇటువంటి ఏ కులాల వారైతే ఇప్పటి వరకు పదవులను పొందలేకపోయారో అటువంటి వారిని గుర్తించి పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ ఇదే ఎత్తుగడను అమలు చేస్తోంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో కులసమీకరణం అనే పాయింట్ చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది. అందుకే దేశంలోని చాలా రాష్ట్రాలలో ఈ అంశాన్ని ఉపయోగించుకుని ఎన్నికలలకు వెళ్లడం మనము చూశాము. అంతే కాకుండా ఇప్పటికే ఈ విధంగా చేయడంలో ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇప్పుడు బీజేపీ చూపు తమిళనాడుపై పడింది. ఇక్కడ కూడా కులసమీకరణాన్ని చక్కగా క్షేత్రస్థాయిలో ఉపయోగించుకుంటోంది. తమిళనాడు రాజకీయాలు అంటే కేవలం రెండు పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అవే డీఎంకే మరియు ఏఐడీఎంకే. సుదీర్ఘ కాలంపాటు ఈ రెండు పార్టీలే రాజకీయాలను శాసించాయి. వీరు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే అధికారాన్ని ఇచ్చారు. మిగతా వర్గాలను అణగదొక్కేశారు. ముఖ్యంగా ఎస్ సి మరియు ఎస్ టి వర్గాలను అణచివేశారు.

అయితే బీజేపీ మాత్రం గత అయిదేళ్ల నుండి ఈ కులాలపైనే గ్రౌండ్ ఎఫర్ట్ పెట్టింది. అయితే ఇప్పుడు రానున్న ఫలితాలలో ఇది ఎంతవరకు ప్రభావం చూపనుందో తెలియాలి..? అలాగే భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలి...?  ఇప్పుడు కన్యాకుమారిలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇక్కడ ఏ ఐ డీఎంకే బీజేపీకి మద్దతుగా ఉంది. బీజేపీ ఇక్కడ ఉన్న కుల సమీకరణాలని క్యాష్ చేసుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది బీజేపీ. కన్యాకుమారిలో ఉన్న దేవేంద్ర కుల విల్లలార్ లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కులం వారిపై ముఖ్యంగా లెఫ్ట్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే బీజేపీ దేవేంద్ర  విల్లలార్ లకు మరియు నాడార్ లకు పెద్ద పెద్ద పదవులను ఇస్తాం అన్న లక్ష్యంతో వీరిని ఆకట్టుకోనున్నారు.

అంతే కాకుండా ఈ కులసమీకరణాల ప్రణాళికలో భాగంగా కన్యాకుమారిలో నాడార్ లతో పశ్చిమ జిల్లాలోని గ్రౌండర్ కులాలవారిని కలపడం కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు డిపాజిట్లు కూడా రాని సమయంలో ప్రస్తుతం లక్ష ఓట్లు పడే వరకు వచ్చింది. అయితే అక్కడ పద్మనాభపురంలోని కృష్ణవాఘై కులం వారిని ఆకర్శించడానికి అక్కడ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చినట్లు సమాచారం. ఈ విధంగా బీజేపీ కుల సమీకరణాలను వాడుకుని దేశ వ్యాప్తంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ నడుం బిగించింది. మరి చూద్దాం ఈ అంశం ఎంతమేరకు వారికి ప్లస్ అవుతుందో...?



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నాలుగూ చోట్ల వైసీపీకి దెబ్బ ?

మరో సుకుమార్ శిష్యుడితో సాయి ధరమ్ తేజ్ ?

అసలు వర్మ డైరెక్టర్ ఎలా అయ్యాడు అనిపించే సినిమాలు.!!

పుష్ప ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది ??

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>