MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-pink-pawan-kalyan1aaca5ba-d68d-4b79-afd3-3426d30dd25f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-pink-pawan-kalyan1aaca5ba-d68d-4b79-afd3-3426d30dd25f-415x250-IndiaHerald.jpgపవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సహాం వస్తుంది. తెర మీద తమ అభిమాన హీరోను చూస్తే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఒక్కటే అరుపులు, ఈలలు.అలాంటి తరుణం మరి కొద్ది గంటల్లో రానుంది అనడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి. థియేటర్‌లో సందడి చేయడానికి ఏప్రిల్‌ 9న పవన్ 'వకీల్‌సాబ్‌’గా మన ముందుకు వస్తున్నారు. కమర్షియల్‌ హంగులకు దూరంగా మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రానుంది. ఇప్పటికే పింక్ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయగా అక్కడ Vakeel sab, pink, pawan kalyan;pawan;amitabh bachchan;abhirami;ajith kumar;choudary actor;trivikram srinivas;venu;cinema;telugu;tamil;producer;remake;lawyer;producer1;hero;pink;april;ajit pawar;v;venu thottempudiఅప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??Vakeel sab, pink, pawan kalyan;pawan;amitabh bachchan;abhirami;ajith kumar;choudary actor;trivikram srinivas;venu;cinema;telugu;tamil;producer;remake;lawyer;producer1;hero;pink;april;ajit pawar;v;venu thottempudiWed, 07 Apr 2021 17:37:45 GMTఏప్రిల్‌ 9న పవన్ 'వకీల్‌సాబ్‌’గా మన  ముందుకు వస్తున్నారు. కమర్షియల్‌ హంగులకు దూరంగా మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రానుంది. ఇప్పటికే పింక్  చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయగా అక్కడ కూడా అందరి ప్రశంసలు అందుకుంది. మరి మూడు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసారు.మరి కొన్ని  గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వకీల్‌సాబ్‌’ విశేషాలపై ఓ లుక్కేయండి..!సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని కళ్ళకు కట్టినట్లు  చూపించిన చిత్రం ‘పింక్‌’. సుజిత్‌ సర్కార్‌, రితేష్‌ షా రచించిన ఈ కథకు అనిరుద్‌ రాయ్‌ చౌదరి తన దర్శకత్వంతో ప్రాణం పోశారు. పింక్ సినిమాలో  అమితాబ్ బచ్చన్‌, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషించారు.


పింక్ సినిమాలో  రెండు పాటలు మినహాయించి ఇందులో ఎలాంటి రొమాన్స్‌, ఇతర కమర్షియల్‌ హంగులు ఉండవు. ఎక్కువ భాగం కథ కోర్టు రూమ్‌లోనే సాగుతోంది. అలాగే, బిగ్‌బి వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. ఆయనకు వివాహమైనట్లు చూపిస్తారు.. కానీ సతీమణి పాత్రకు అంత ఎక్కువ పరిధి ఉండదు.  అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ.వందకోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా.ఇంకా తమిళ రీమేక్ విషయానికి వస్తే  కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అజిత్‌ ఈ సినిమాలో హీరోగా నటించాడు.బాలీవుడ్‌లో ‘పింక్‌’ మంచి విజయం సాధించడంతో ఆ సినిమాని తమిళంలోనూ రీమేక్‌ చేయాలని భావించి అజిత్ ను హీరోగా తీసుకున్నారు నిర్మాత బోనీకపూర్‌. అలా వచ్చిందే ‘నేర్కొండపార్వై’ సినిమా.  కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా కథలో కొన్ని స్వల్ప మార్పులు చేశారు దర్శకుడు హెచ్‌.వినోద్‌. శ్రద్ధాశ్రీనాథ్‌, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా కీలకపాత్రలు పోషించారు. ఇందులో అజిత్‌ మధ్య వయస్కుడిగా, గర్భవతి అయిన భార్యను(విద్యాబాలన్‌) కోల్పోయిన భర్తగా కనిపిస్తారు.  సుమారు 150 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేసినట్లు అంచనా.పింక్‌’, ‘నేర్కొండపార్వై’ విజయాలు అందుకున్న తరుణంలో ‘వకీల్‌సాబ్‌’ పేరుతో అదే కథను తెలుగులోకి రీమేక్‌ చేశారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని కథలో ఎలాంటి మార్పులు చేయకుండా కొన్ని కమర్షియల్‌ హంగుల్ని ఇందులో చేర్చారు దర్శకుడు వేణు శ్రీరామ్‌. ఇందులో పవన్‌ని యంగ్‌ లుక్‌లో చూపించారు. అలాగే పవన్‌-శ్రుతిహాసన్‌ల మధ్య ఓ లవ్‌ట్రాక్‌ ఉండనుంది.అలాగే  ట్రైలర్‌ చూస్తే ఫైట్‌ సీక్వెన్స్‌ కూడా  భారీగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. మరోవైపు ‘పింక్‌’, ‘నేర్కొండపార్వై’లో లేని విధంగా పవన్‌కు వ్యతిరేకంగా వాదించే న్యాయవాది పాత్రలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ని నటింపచేసారు.


ఇక ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి.నేర్కొండపార్వై’ విడుదలకు ముందు ఆ సినిమా ట్రైలర్‌ని ఓ సారి బోనీకపూర్‌ నాకు పంపించారు. ఆ వీడియో చూస్తున్నంతసేపు హీరో పాత్రలో పవన్‌కల్యాణే నాకు కనిపించారు. ఆ ట్రైలర్‌ని నేను హరీశ్‌ శంకర్‌కు పంపించగా ఆయన కూడా ఈ సినిమా  కల్యాణ్‌ గారికి కరెక్ట్‌గా సెట్‌ అవుతుంది’ అని అన్నాడు.తరువాత  ‘నేర్కొండపార్వై’ విడుదలై.. హిట్టైన తర్వాత ‘అల.. వైకుంఠపురములో..’ షూట్‌ లొకేషన్‌కు వెళ్లి త్రివిక్రమ్‌ని కలిసి పవన్ తో మాట్లాడాలని త్రివిక్రమ్ ని అడగగా దానికి త్రివిక్రమ్‌ ఓకే అని ఓరోజు పవన్‌తో మీటింగ్‌ ఏర్పాటు చేయించారు. పవన్‌ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకే అన్నారు. ఆ తర్వాత దర్శకుడిగా వేణుశ్రీరామ్‌ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నాం. ‘పింక్‌’ రైటర్స్‌, డైరెక్టర్స్‌, బోనీకపూర్‌, హరీశ్‌ శంకర్‌, త్రివిక్రమ్‌, వేణుశ్రీరామ్‌.. వీళ్ల వల్లే పవన్‌తో సినిమా చేయాలనే నా డ్రీమ్‌ తీరింది’’ అని దిల్‌రాజు చెప్పారు


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రైమ్ లో విడుదలైన రాజ్ తరుణ్ ప్లాప్ థ్రిల్లర్

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?

వకీల్ సాబ్ లో కోర్టు సీన్లు సినిమాకే పెద్ద హైలైట్ అట....

మరోసారి నాగచైతన్యతో జతకట్టనున్న ఆ హీరోయిన్..?

క‌రోనా సంజీవ‌ని వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించిన సోనూసూద్..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>