Andhra Pradesh
oi-Syed Ahmed
హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తన పిటిషన్ విషయంలో సీబీఐ కోర్టులో ఏం జరిగిదో ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు ఈ పిటిషన్‌పై వైసీపీ నేతల ప్రయత్నాలను కూడా ఆయన వెల్లడించారు.
సీబీఐ కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ రిటర్న్ చేశారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు తెలిపారు. దీనికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పిటిషన్‌లో జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి తాను సమర్పించిన ఆధారాలపై సీబీఐ కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని రఘురామ వెల్లడించారు. దీంతో శుక్రవారం మరోసారి పూర్తి ఆధారాలతో పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన ప్రకటించారు. తన పిటిషన్ తిరస్కరణకు గురైందని వచ్చిన వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి జగన్‌పై దాఖలైన అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని, కాబట్టి 11 ఛార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామరాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. ప్రజాస్వామ్యాన్నిరక్షించుకునేందుకు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు రఘురామ నిన్న వెల్లడించారు. జగన్ నిర్దోషిలా బయటపడాలనేదే తన ఉద్దేశమన్నారు. పార్టీని రక్షించుకునే బాధ్యత తనపై ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ కోర్టు పూర్తి వివరాలు కోరడంతో వాటిని సమర్పించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
సీబీఐ కోర్టులో ఏం జరిగిందంటే ? రఘురామ క్లారిటీ- శుక్రవారం మళ్లీ పిటిషన్#Raghuramakrishnamraju #Ysrcp #YSJagan pic.twitter.com/e4sAfYImlv
— oneindiatelugu (@oneindiatelugu) April 7, 2021
ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా ఉన్న వైఎస్ జగన్‌కు గతంలో అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వారం వారం విచారణ జరుగుతున్నా జగన్ మాత్రం కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు కూడా పొందుతున్నారు. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనిపై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా.. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్ధానం తిప్పిపంపింది.