Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/soomu-verraju6ca636ab-7ac9-4f33-a590-b2bc13466a50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/soomu-verraju6ca636ab-7ac9-4f33-a590-b2bc13466a50-415x250-IndiaHerald.jpg ఏపీలో ఉద్యోగులకు జీతాలు మరియు పింఛన్లు ఇవ్వలేనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందా. ఇంతటి ఆర్థిక విపత్తును జగన్ సర్కార్ దాస్తోందా అని అంటే అవుననే అంటున్నారు సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కి దేశంలో అప్పులు పుట్టని దీనస్థితిలో ఉందని అయితే వెంటనే రాsoomu verraju;amala akkineni;vidya;bharatiya janata party;jagan;andhra pradesh;electricity;fire;central governmentఏపీలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన సోము వీర్రాజు...?ఏపీలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన సోము వీర్రాజు...?soomu verraju;amala akkineni;vidya;bharatiya janata party;jagan;andhra pradesh;electricity;fire;central governmentWed, 07 Apr 2021 02:00:00 GMT
 ఏపీలో ఉద్యోగులకు జీతాలు మరియు పింఛన్లు ఇవ్వలేనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందా. ఇంతటి ఆర్థిక విపత్తును జగన్ సర్కార్ దాస్తోందా అని అంటే అవుననే అంటున్నారు సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కి దేశంలో అప్పులు పుట్టని దీనస్థితిలో ఉందని అయితే వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సోము వీర్రాజు కోరారు. విషయంలోకి వెళితే...



 ఆంధ్రప్రదేశ్ లో  రెండేళ్లుగా వచ్చే ఆదాయాన్నంతా నవరత్నాల అమలుకోసం పప్పుబెల్లాల్లా పంచుకుంటూ పోతూ ఒక్క ఇటుకను పేర్చకుండా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. ఒక పక్క అభివృద్ధి అనే మాటే వినబడకుండా ఉంటే చేసిన అప్పులు ఏమౌతున్నాయో అనేది అంతుబట్టని రహస్యంగా మారిపోయిందన్నారు.


ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకుంటే, మరోపక్క రిజర్వుబ్యాంకు అప్పులు ఇవ్వని పరిస్థితి ఏర్పడటం ఆర్థిక సంక్షోభాన్ని తలపిస్తోందని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. లాక్ డౌన్ కాలంలో సైతం కేంద్రం రాష్ట్రానికి పెద్దఎత్తున వైద్యసహాయం, ఆర్ధిక సహాయం చేసిందని చెప్పారు. పంచాయతీలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేసి గ్రామీణాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. అలాగే లక్షల కోట్ల నిధులతో ఇళ్ల నిర్మాణం, రహదారులు, పోర్టుల అనుసంధానం, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్లు విద్యుత్, మంచినీరు, పారిశుధ్యం, విద్యాసంస్థలు, ప్రభుత్వాసుపత్రుల నిర్మాణానికి చేస్తున్న పనులన్నీ కేంద్రం ఇచ్చే నిధులతో జరుగుతుండగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.


అయితే ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు తెచ్చిన అప్పల్లో రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చుచేయకుండా సంక్షేమానికే కేటాయించడం వల్ల ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పిందని జగన్ సర్కార్ తీరును సోము వీర్రాజు ఎండగట్టారు. ఇలాంటి ఆర్ధిక సంక్షోభం చరిత్రలో చూడలేదని తక్షణం పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పై శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గాజు గ్లాస్ ఎఫెక్ట్: ఆ షాక్ కమలానికి కాదా?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>