PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guntur-ggh-doctors-female-baby-3-legsb020078e-0d99-487f-8a37-0f751273ae16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guntur-ggh-doctors-female-baby-3-legsb020078e-0d99-487f-8a37-0f751273ae16-415x250-IndiaHerald.jpgగుంటూరు జీజీ హెచ్ వైద్యులు ఒక అరుదైన శాస్త్ర చికిత్స చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. సాధారణంగా మనం రెండు కాళ్లతో జన్మించిన మనుషులను చూస్తూ ఉంటాము. కానీ విచిత్రంగా ఒక శిశువు మూడు కాళ్లతో జన్మించింది. మూడవ కాలును ఆపరేషన్ చేసి తొలగించాలంటే చాలా డబ్బులు కావాలి. కానీ తల్లితండ్రులు పేదవాళ్ళు కావడంతో ఎంతో విలువైన సర్జరీని సైతం ఆరోగ్య శ్రీ కార్డు మీద చేసి విజయంవంతగా మూడవ కాలును తొలగించారు. వివరాలలోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడేనికి చెందిన మోహనరావు, వెంకటేశ్వరమ్మ దంGuntur, GGH, doctors, female baby, 3 legs;manu;godavari river;district;telugu;west godavari;butter;chinthalapudi venkatramaiah;march;nuziveedu;v;kaliమూడు కాళ్లతో వింత శిశువు జననం ఎక్కడంటే.. !!మూడు కాళ్లతో వింత శిశువు జననం ఎక్కడంటే.. !!Guntur, GGH, doctors, female baby, 3 legs;manu;godavari river;district;telugu;west godavari;butter;chinthalapudi venkatramaiah;march;nuziveedu;v;kaliWed, 07 Apr 2021 11:15:00 GMTగుంటూరు జీజీ హెచ్ వైద్యులు ఒక అరుదైన శాస్త్ర చికిత్స చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. సాధారణంగా మనం రెండు కాళ్లతో  జన్మించిన మనుషులను చూస్తూ ఉంటాము. కానీ విచిత్రంగా ఒక శిశువు మూడు కాళ్లతో జన్మించింది. మూడవ కాలును ఆపరేషన్ చేసి తొలగించాలంటే చాలా డబ్బులు కావాలి. కానీ తల్లితండ్రులు పేదవాళ్ళు కావడంతో ఎంతో విలువైన సర్జరీని సైతం ఆరోగ్య శ్రీ కార్డు మీద చేసి విజయంవంతగా మూడవ కాలును తొలగించారు. వివరాలలోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడేనికి చెందిన మోహనరావు, వెంకటేశ్వరమ్మ దంపతులకు గత నెల 4న నూజివీడులో  ఆడ బిడ్డ జన్మించింది.



కానీ పుట్టడంతోనే ఆ శిశువు మూడు కాళ్లతో జన్మిచినది. నడుము భాగం నుంచి మూడో కాలు ఏర్పడింది. వైద్యుల సూచన మేరకు ఆ చిన్నారిని గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. శిశువుకు అవసరమైన త్రీడీ ఎమ్మారై, త్రీడీ సీటీస్కాన్‌ చేసి నడుము లోపలి భాగం నుంచి మూడో కాలు వచ్చినట్లు తేల్చారు. మూడో కాలి వద్ద పురుష జననాంగాలు ఏర్పడి, రెండు కాళ్లకు సంబంధించిన నరాలు మూడో కాలికి అతుక్కుని ఉన్నాయి.న్యూరో విభాగం వైద్యులు శేషాద్రిశేఖర్‌, హనుమ శ్రీనివాసరెడ్డి మార్చి 31న అరుదైన సర్జరీ చేసి మూడో కాలును తొలగించారు. ఇది వెన్నుమూకకి సంబంధించిన ఒక రకమైన వైకల్యమని తెలిపారు. చాలా అరుదుగా ఇటువంటి వ్యాధి వస్తుందని అంటున్నారు డాక్టర్లు.



దీనిని వైద్యనీక  పరిభాషలో ‘లంబార్‌ మైలో మెనింగోసీల్‌ విత్‌ ట్పైపీడస్‌ డిఫార్మటీ’గా పిలుస్తారన్నారు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులను పలువురు అభినందించారు. ఇటీవల రూ.1.5 కోట్ల ఖరీదు చేసే అత్యాధునిక లైకా మైక్రోస్కోప్‌ వైద్య పరికరాన్ని న్యూరోసర్జరీ వైద్య విభాగానికి ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పరికరం ఉపయోగించే ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. అలాగే ఈ ఆపరేషన్ కి ఎంతో ఖర్చు అవుతుంది. కానీ ఈ ఆపరేషన్ ఉచితంగా చేసి, వాళ్ళ పాపని కాపాడినందుకు తల్లిదండ్రులు జీజీ హెచ్  వైద్యులకు, ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు.




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేపో రేటుపై రిజర్వ్ బ్యాంకు కీలక ప్రకటన

సైలెంటుగా సడన్ షాక్ ఇచ్చిన దేత్తడి హారిక...?

పోతూ పోతూ ఫిట్టింగ్‌ పెట్టేసి వెళ్లిన నిమ్మగడ్డ.. చిక్కుల్లో నీలం సాహ్నీ?

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!

వకీల్ సాబ్ టేకింగ్ తో ఫిదా అయిన దిల్ రాజు.. దర్శకుడికి మరో ఆఫర్..?

మళ్లీ సీన్‌లోకి జగన్ బెయిల్ కేసు.. అసలేం జరుగుతోంది..?

తిరుపతిలో అదే జరిగితే జగనే బాధ్యుడు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>