PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manikkam-tagored2cf47db-5b43-488e-ae89-4c5912b7851f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manikkam-tagored2cf47db-5b43-488e-ae89-4c5912b7851f-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ రాష్ట్ర పార్టీ నేత‌ల‌తో అంటీముంట‌న్న‌ట్లుగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. పీసీసీ చీఫ్ ప‌ద‌వి విష‌యంలో రేవంత్‌రెడ్డికి ఆయ‌న అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా కొంత‌మంది సీనియ‌ర్లు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయ‌డంతో ఆయ‌న రాష్ట్రానికి రావ‌డ‌మే మానేశారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి, ఇప్పుడు సాగ‌ర్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి కూడా ఆయ‌న దూరంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. దుబ్బాక ఉప ఎన్నిక స‌మ‌యంలో ఎంతో ఆక్టివ్‌గా ఉన్న ఆయ‌న ఆ త‌ర్వాత జ‌రిగిన జీహెచ్ manikkam tagore;congress;రాజీనామా;kanna lakshminarayana;partyమాణికం ఠాగూర్ ఎక్క‌డ‌..? ప‌త్తాలేని పార్టీ ఇన్చార్జి..మాణికం ఠాగూర్ ఎక్క‌డ‌..? ప‌త్తాలేని పార్టీ ఇన్చార్జి..manikkam tagore;congress;రాజీనామా;kanna lakshminarayana;partyWed, 07 Apr 2021 09:30:00 GMTకాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ రాష్ట్ర పార్టీ నేత‌ల‌తో అంటీముంట‌న్న‌ట్లుగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. పీసీసీ చీఫ్ ప‌ద‌వి విష‌యంలో రేవంత్‌రెడ్డికి ఆయ‌న అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా కొంత‌మంది సీనియ‌ర్లు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయ‌డంతో ఆయ‌న రాష్ట్రానికి రావ‌డ‌మే మానేశారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి, ఇప్పుడు సాగ‌ర్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి కూడా ఆయ‌న దూరంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. దుబ్బాక ఉప ఎన్నిక స‌మ‌యంలో ఎంతో ఆక్టివ్‌గా ఉన్న ఆయ‌న ఆ త‌ర్వాత జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు, పీసీసీ చీఫ్ ప‌ద‌వి విష‌యంలో అధిష్ఠానం ఢిల్లీకి పిల‌వ‌డం, రాష్ట్రంలో కొంత‌మంది సీనియ‌ర్లు మాణికంపై సీరియ‌స్గా ఉండ‌టం వంటి ప‌రిణామాల‌తో ఆయ‌న పార్టీని చ‌క్క‌దిద్దే ప‌నిని మానుకున్న‌ట్లుగా తెలుస్తోంది.


 కేవ‌లం జూమ్‌లో కొంత‌మంది పార్టీ నేత‌ల‌తో ఆయ‌న మీట్ అవుతున్నారు. ఆ మీటింగ్‌లోనే దిశా నిర్దేశం చేస్తూ బాధ్య‌త‌లు నెర‌వేరుస్తున్నాన‌ని చెప్పుకుంటుండ‌టం విశేషం.వరుస వైఫల్యాలు చవి చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ నేతల్లో నేటికి సమన్వయం అనేది మచ్చుకైనా కానరావడం లేదు. ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా పార్టీ నేతల వ్యవహారశైలి ఉంటోందని చెప్పక తప్పదు.పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక అనేది కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పదవిపై కన్నేసిన నేతలు.. రేసులో ఉన్న నేతలు అధిష్ఠానం వద్ద తమ పలుకుబడిని వినియోగించుకునేందుకు యత్నించిన సందర్భాలనేకం.


ఆ సమయంలోనే పార్టీలో ఇతర నేతలు రేసులో ఉన్న వారిని అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన దాఖలాలు లేకపోలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ముళ్లపొదను కదిలించే కన్నా ఉత్తమ్‌నే కొనసాగించాలని అధిష్టానం నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఉత్తమ్‌నే అప్పట్నించీ కొనసాగిస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దుబ్బాకలో ఘోర వైఫల్యం.. గ్రేటర్‌లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా రెండే రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్న దరిమిలా ఉత్తమ్ నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక అధిష్ఠానంకు అనివార్యంగా మారింది. మరో ముఖ్యమైన పరిణామం కూడా చోటు చేసుకుంటోంది. సామాజిక సమీకరణాల కూర్పు పేరుతో కొందరు రేసులో వున్న ఆ ఇద్దరిని శాయశక్తులా అడ్డుకుంటున్నారన్న ప్రచారం కొనసాగుతోంది.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>