PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp17811ca9-5b99-425b-a0ef-b11eaf0e2d78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp17811ca9-5b99-425b-a0ef-b11eaf0e2d78-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరించడం వల్ల అధికార వైసీపీకి మరింత అడ్వాంటేజ్ వస్తుందని అంతా అనుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ పోటీలో ఉంటే ఓ 80 శాతంపైనే వరకు గెలుచుకోవచ్చని వైసీపీ అనుకుంది. ఇక పోటీలో లేకుంటే క్లీన్‌స్వీప్ చేసేస్తామని వైసీపీ నేతలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే ఊహించని విధంగా తెలుగు తమ్ముళ్ళు ఎన్నికల బరిలో దిగుతున్నారు.tdp;telugu desam party;telugu;tdp;ycp;partyతమ్ముళ్ళకు భలే ఛాన్స్...వైసీపీని ఆడుకుంటున్నారుగా!తమ్ముళ్ళకు భలే ఛాన్స్...వైసీపీని ఆడుకుంటున్నారుగా!tdp;telugu desam party;telugu;tdp;ycp;partyWed, 07 Apr 2021 03:00:00 GMTతెలుగుదేశం పార్టీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరించడం వల్ల అధికార వైసీపీకి మరింత అడ్వాంటేజ్ వస్తుందని అంతా అనుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ పోటీలో ఉంటే ఓ 80 శాతంపైనే వరకు గెలుచుకోవచ్చని వైసీపీ అనుకుంది. ఇక పోటీలో లేకుంటే క్లీన్‌స్వీప్ చేసేస్తామని వైసీపీ నేతలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే ఊహించని విధంగా తెలుగు తమ్ముళ్ళు ఎన్నికల బరిలో దిగుతున్నారు.


గతేడాదే నామినేషన్స్ కార్యక్రమం ముగియడంతో తమ్ముళ్ళు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే చంద్రబాబు ఎన్నికలని బహిష్కరిస్తున్నామని చెప్పినా కూడా కొన్నిచోట్ల తమ్ముళ్ళు పోటీలో దిగేశారు. అయితే కొన్నిచోట్ల వైసీపీతో తమ్ముళ్ళు ఆడేసుకుంటున్నారు. టీడీపీ బలంగా ఉన్నచోట్ల, అభ్యర్ధులని తమ పార్టీలోకి తీసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.


మామూలుగానే పార్టీలు మారేటప్పుడు ఏ నాయకుడు కూడా ఎలాంటి లాభం లేకుండా పార్టీ జంప్ చేయరు. ఇక ఇప్పుడు టీడీపీని తప్పిస్తే చాలు గెలుపు ఖాయం అనుకునే వైసీపీ నేతలు, టీడీపీ అభ్యర్ధులకు భారీగానే ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. అయితే కొన్నిచోట్ల బేరాలు తెగకపోతే, టీడీపీ అభ్యర్ధులు పోటీలోకి దిగేస్తున్నారు. ప్రచారం చేసేస్తున్నారు.


ఇక బేరాలు తెగితే మాత్రం టీడీపీ అభ్యర్ధులు వైసీపీలోకి జంప్ కొట్టేస్తున్నారు. అలా కొన్నిచోట్ల ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి అభ్యర్ధులు వైసీపీలోకి వెళ్ళిపోయారు. అలాగే మరికొన్ని చోట్ల అయితే వైసీపీని ఓడించాలనే కసితో తమ్ముళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ ఓడిపోయినా పెద్దగా ఇబ్బంది రాదని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు బాబు చెప్పేశారు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే టీడీపీకి జరిగే నష్టం పెద్దగా ఉండదు.  కానీ గెలిస్తే మాత్రం టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు వద్దనుకున్న కూడా జనం తమని గెలిపించారని టీడీపీ నేతలు చెప్పుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎన్నికలు బహిష్కరణ అనే ఒక్క కాన్సెప్ట్‌ తెలుగు తమ్ముళ్ళకు బాగా కలిసివస్తుందనే చెప్పొచ్చు. మరి చూడాలి ఎన్నికల్లో తమ్ముళ్ళు ఏ మేర సత్తా చాటుతారో.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>