PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasenac575c602-8f66-49e4-85d8-7da5f9ab98cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasenac575c602-8f66-49e4-85d8-7da5f9ab98cd-415x250-IndiaHerald.jpgఏపీలో బీజేపీకి ఉన్న బలమెంత? అంటే ఆ పార్టీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు పడవు అనే సమాధానాలే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి అలాగే ఓట్లు పడ్డాయి. ఆ పార్టీ కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేదు. ఇలా ఒక్కశాతం ఓట్లు కూడా రాకపోయినా సరే, కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బీజేపీ నేతల చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పైగా జనసేనతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.janasena;tiru;bharatiya janata party;jagan;janasena;2019;tirupati;parliment;husband;cheque;tdp;central government;ycp;janasena party;partyగాజు గ్లాస్ ఎఫెక్ట్: ఆ షాక్ కమలానికి కాదా?గాజు గ్లాస్ ఎఫెక్ట్: ఆ షాక్ కమలానికి కాదా?janasena;tiru;bharatiya janata party;jagan;janasena;2019;tirupati;parliment;husband;cheque;tdp;central government;ycp;janasena party;partyWed, 07 Apr 2021 02:00:00 GMTఏపీలో బీజేపీకి ఉన్న బలమెంత? అంటే ఆ పార్టీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు పడవు అనే సమాధానాలే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి అలాగే ఓట్లు పడ్డాయి. ఆ పార్టీ కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేదు. ఇలా ఒక్కశాతం ఓట్లు కూడా రాకపోయినా సరే, కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బీజేపీ నేతల చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పైగా జనసేనతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.


మొదట ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెట్టేసి, నెక్స్ట్ వైసీపీని ఓడించేసి అధికారంలోకి వచ్చేయాలని కలలు కంటుంది. అందుకే బీజేపీ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఆఖరికి జనసేనకు బలం ఉన్నా సరే తిరుపతి పార్లమెంట్ సీటులో పోటీ చేయడానికి సిద్ధమైంది. అలాగే వైసీపీ, టీడీపీలకు చెక్ పెట్టి, తిరుపతి సీటుని దక్కించుకుంటామని చెబుతోంది. అయితే తమ గెలుపు అడ్డుకోవడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుని నవతరం పార్టీ అభ్యర్ధికి కేటాయించారని మాట్లాడుతున్నారు.


ఈ గాజు గ్లాసు వల్ల పొత్తులో భాగంగా తమకు పడాల్సిన జనసేన ఓట్లు నవతరం అభ్యర్ధికి పడతాయని, కాబట్టి వెంటనే ఆ గుర్తుని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. అయితే ఇలా జరగడం వల్ల బీజేపీకి అంత డ్యామేజ్ జరుగుతుందా? అంటే పెద్దగా ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే తిరుపతిలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీల మధ్యే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక అధికారంలో ఉండటం, జగన్ అందించే సంక్షేమ పథకాలు బట్టి చూస్తే తిరుపతిలో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే.


అలాగే టీడీపీ ఎంతవరకు పోటీ ఇస్తుందనేది చూడాలి. అయితే బీజేపీకి జనసేన ఓట్లు ఎంతవరకు పడతాయనేది కూడా చూడాలి. ఇక గాజు గ్లాసు ఉండటం వల్ల ఆ ఓట్లలో కాస్త చీలిక రావోచ్చు. కానీ అది పెద్ద డ్యామేజ్ జరిగే స్థాయిలో ఉండదనే చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టం లేని కొందరు జనసేన ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఒకవేళ వారు గనుక గాజు గ్లాసు చూసి, దానికి ఓటు వేస్తే టీడీపీకి కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి గాజు గ్లాస్ గుర్తు, అటు బీజేపీతో పాటు ఇటు టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉంది.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>