PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp90410a7c-5ef7-4b71-bc90-d153ca213879-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp90410a7c-5ef7-4b71-bc90-d153ca213879-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. మళ్ళీ అందులోనూ కమ్మ, రెడ్డి సామాజికవర్గాల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. టీడీపీలో కమ్మ కులానికి చెందిన నాయకుల హవా ఎక్కువగా ఉంటే, వైసీపీలో రెడ్డి వర్గానికి చెందిన నేతల డామినేషన్ ఉంటుంది. ఇక ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.tdp;shankar;kamma;jagan;annabathuni siva kumar;devineni avinash;2019;chintamaneni prabhakar;cheque;tdp;ycp;mylavaram;denduluru;reddy;dookudu;pedakurapadu;abbaya chowdary kothari;bolla brahmanaidu;siva kumarకమ్మ వర్సెస్ కమ్మ: నెక్స్ట్ దెబ్బ పడేది ఎవరికో?కమ్మ వర్సెస్ కమ్మ: నెక్స్ట్ దెబ్బ పడేది ఎవరికో?tdp;shankar;kamma;jagan;annabathuni siva kumar;devineni avinash;2019;chintamaneni prabhakar;cheque;tdp;ycp;mylavaram;denduluru;reddy;dookudu;pedakurapadu;abbaya chowdary kothari;bolla brahmanaidu;siva kumarWed, 07 Apr 2021 04:00:00 GMTఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. మళ్ళీ అందులోనూ కమ్మ, రెడ్డి సామాజికవర్గాల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. టీడీపీలో కమ్మ కులానికి చెందిన నాయకుల హవా ఎక్కువగా ఉంటే, వైసీపీలో రెడ్డి వర్గానికి చెందిన నేతల డామినేషన్ ఉంటుంది. ఇక ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ నేతల హడావిడి ఎక్కువగా ఉండేది. ఇక ఇప్పుడు ఎవరి ఆధిక్యం ఎక్కువ ఉందో చెప్పాల్సిన పని లేదు. అలా అని టీడీపీలో రెడ్డి వర్గానికి చెందిన నేతలు, వైసీపీలో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు లేకుండా లేరు. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా ఈ సామాజికవర్గ సమీకరణలు ఉంటాయి.


అందుకే జగన్ 2019 ఎన్నికల్లో కొందరు కమ్మ టీడీపీ నేతలపై అదే సామాజికవర్గానికి చెందిన నేతలని వైసీపీలో నిలబెట్టారు. అలా నిలబెట్టి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు. దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో రాజకీయాలు చేస్తున్న నేతలకు జగన్ చెక్ పెట్టేశారు.  వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడుని నిలబెట్టి, టీడీపీ సీనియర్ నేత జి‌వి ఆంజనేయులుని ఓడించారు. అటు తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, ఆలపాటి రాజాని ఓడించారు. పెదకూరపాడులో నంబూరి శంకర్ రావు, కొమ్మాలపాటి శ్రీధర్‌ని ఓడించారు.


అలాగే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమాపై, దెందులూరులో అబ్బయ్య చౌదరీ, చింతమనేని ప్రభాకర్‌పై గెలిచారు. అయితే వైసీపీ నేతలు ఓడించిన టీడీపీ నేతలంతా రాజకీయాల్లో సీనియర్లే. ఇలా ఒకే సామాజికవర్గం వారిని నిలబెట్టి జగన్ టీడీపీకి చెక్ పెట్టారు. పైగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు మరింత దూకుడుగా వెళుతున్నారు.


ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు చెక్ పెట్టారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ టీడీపీ నేతలకు దెబ్బవేయాలని చూస్తున్నారు. కానీ నెక్స్ట్ మాత్రం సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ నేతలు కూడా పుంజుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కమ్మ నేతలకు దెబ్బ వేయడానికి టీడీపీ కమ్మ నేతలు సిద్ధమవుతున్నారు. మరి చూడాలి ఈ కమ్మ వర్సెస్ కమ్మ పోరులో దెబ్బ పడేది ఎవరికో?





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జాతిరత్నాలు 25 డేస్ కలెక్షన్ ఎంత వచ్చింది అంటే..?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>