Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej8dde3c1b-9275-47ce-8728-c54c4f42ddd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej8dde3c1b-9275-47ce-8728-c54c4f42ddd3-415x250-IndiaHerald.jpgగత ఏడాది లాక్‌‌డౌన్ వేళ మెగా వారింట పెళ్లి బాజాలు మోగాయి. మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమ సన్నిహిత ఫ్యామిలీ కుర్రాడు చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది. అయితే ఈ వేడుక అనంతరం ఒక్కసారిగా అందరి చూపు నాగబాబు కొడుకు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌పై పడింది. లైన్ క్లియర్ అయింది కాబట్టి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ఉన్న వరుణ్.. అతిత్వరలో పెళ్లి పీటలెక్కేస్తున్నారు అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే పలు సందర్భాల్లో ఈ ఇష్యూపై స్పందించిన నాగబాబు తాజాగా ఫన్నీ రిvarun tej;niharika konidela;prince;tara;varun;varun sandesh;varun tej;tollywood;cinema;marriage;love;interview;sai pallavi;fidaaవరుణ్ తేజ్ పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన నాగబాబు...?వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన నాగబాబు...?varun tej;niharika konidela;prince;tara;varun;varun sandesh;varun tej;tollywood;cinema;marriage;love;interview;sai pallavi;fidaaWed, 07 Apr 2021 03:00:00 GMT
గత ఏడాది లాక్‌‌డౌన్ వేళ మెగా వారింట పెళ్లి బాజాలు మోగాయి. మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమ సన్నిహిత ఫ్యామిలీ కుర్రాడు చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది. అయితే ఈ వేడుక అనంతరం ఒక్కసారిగా అందరి చూపు నాగబాబు కొడుకు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌పై పడింది. లైన్ క్లియర్ అయింది కాబట్టి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ఉన్న వరుణ్.. అతిత్వరలో పెళ్లి పీటలెక్కేస్తున్నారు అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే పలు సందర్భాల్లో ఈ ఇష్యూపై స్పందించిన నాగబాబు తాజాగా ఫన్నీ రియాక్షన్ ఇచ్చి మెగా అభిమానులకు షాకిచ్చారు.



వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశారు నాగబాబు. అంతేకాదు వరుణ్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కానీ వాడే వద్దంటున్నాడంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. దీంతో వరుణ్ ప్రేమలో ఉన్నారని, ఓ హీరోయిన్‌తో లవ్ ట్రాక్ నడుస్తోందని వార్తలు కూడా వచ్చాయి. ఇట్టి వార్తలు పెద్దఎత్తున సర్క్యులేట్ అయినా కూడా మెగా ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోలేదు. ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
ఈ నేపథ్యంలో ఇటీవలే నాగబాబు తన ఫాలోవర్స్‌తో ఇన్స్‌స్టా వేదికగా చిట్ చాట్ చేసి ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. 'వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'మంచి సంబంధాలు ఉంటే చూడండి' అని ఆన్సర్ చేశారు.


అయితే 'వరుణ్ ఒక మిడిల్ క్లాస్ గర్ల్ తోనే లైఫ్ అనుకొని ఆ అమ్మాయినే చేసుకుంటా.. అదే ఫిక్స్ అంటే మీరు ఏం చేస్తారు?' అని మరో నెటిజన్ అడగ్గా.. 'మీకు మీకు ఓకే అయితే నేనేమంటా..!' అని చెప్పి వరుణ్ పెళ్లి మ్యాటర్‌ని మరింత చర్చనీయాంశం చేశారు.ఈ క్రమంలో రీసెంట్‌గా మరోసారి అభిమానులతో చిట్ చాట్ చేసిన నాగబాబు.. ఈ సారి మాత్రం బ్రహ్మానందాన్ని వాడేస్తూ వరుణ్ పెళ్లిపై నెటిజన్ వేసిన ప్రశ్నను దాటవేశారు. 'వరుణ్ అన్నా సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తా సార్.. జోడీ బాగుంటుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన నాగబాబు ‘జాతి రత్నాలు' సినిమాలోని క్లైమాక్స్ సీన్ వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చారు.



అందులో కోర్ట్ సీన్‌లో జడ్జ్‌గా ఉన్న బ్రహ్మానందం 'తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అనే డైలాగ్ చెబుతారు. ఇదే వీడియో నాగబాబు పోస్ట్ చేశారు. అంటే అందులో అర్థమేంటనేది క్లియర్‌గా తెలుస్తోంది. అంతకుముందు వరుణ్ తేజ్- సాయి పల్లవి జంటగా 'ఫిదా' మూవీ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా వరుణ్ పెళ్లి మ్యాటర్ జనం నోళ్లలో ఇంతలా నానుతుందంటే.. ఇక నాగబాబు స్టెప్ తీసుకోవాల్సిందేనేమో!



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమ్ముళ్ళకు భలే ఛాన్స్...వైసీపీని ఆడుకుంటున్నారుగా!

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>