
ఆరోజు ఇది జరిగింది
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారం కేసుకు సంబంధించి గత సోమవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకావలసి ఉంది. అయితే తనకు జ్వరం వస్తోందని, అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని రమేష్ జారకిహోళి ఆయన న్యాయవాది శ్యామ్ సుందర్ తో సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఆ రోజు మాత్రం రాలేను
అనారోగ్యంతో తాను చికిత్స చేయించుకుంటున్నానని, తనను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, అందు వలన తాను తరువాత విచారణకు మీ ముందు హాజరౌతానని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ఆయన న్యాయవాది శ్యామ్ సుందర్ ద్వారా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి కొన్ని రోజుల ముందే సూచించడంతో ఆయన అనారోగ్యానికి గురికావడంతో విచారణకు బ్రేక్ పడింది.

కరోనా పాజిటివ్ తో కలకలం
ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 10. 30 గంటల సమయంలో మాజీ మంత్రి రమేష్ జారకిహోళి తీవ్రఅస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి కరోనా పాజిటివ్ అని నిర్దారించారు. అదేరోజు బెళగావి జిల్లాలోని గోకాక్ తాలుకా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.

ఐసీయూ నుంచి డిశ్చార్జి
ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న రమేష్ జారకిహోళికి వైద్యులు చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న రమేష్ జారకిహోళి ఐసీయూలోనే బుధవారం వరకు చికిత్స పొందారు. రమేష్ జారకిహోళికి షుగర్, బీపీ కంట్రోల్ లోకి రావడంతో బుధవారం ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మాజీ మంత్రి రమేష్ జారకిహోళిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించడంతో రాసలీలల సీడీ కేసు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.