PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/beejpaur-encounter8d3fa252-08bf-4f76-a59d-d5aa65ae2644-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/beejpaur-encounter8d3fa252-08bf-4f76-a59d-d5aa65ae2644-415x250-IndiaHerald.jpgఆదివారం నాటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు దళంలోని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ దళాలు పాల్గొన్నాయని భావిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. అతను తన దళంలోకి ఎత్తుగా, బలంగా ఉన్న యువకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గెరిల్లా యుద్ధ విద్యలతోపాటు.. శారీరక వ్యాయామాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోందిbeejpaur encounter;army;central government24 మంది జవాన్ల బలికి కారణం ఇదే!24 మంది జవాన్ల బలికి కారణం ఇదే!beejpaur encounter;army;central governmentTue, 06 Apr 2021 13:55:20 GMT ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది భద్రతా బలగాలు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మావోయిస్టులను దెబ్బకు దెబ్బ కొట్టేలా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.  అయితే బీజాపూర్ ఎన్ కౌంటర్ కు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి.

ఆదివారం నాటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు దళంలోని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ దళాలు పాల్గొన్నాయని భావిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. అతను తన దళంలోకి ఎత్తుగా, బలంగా ఉన్న యువకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గెరిల్లా యుద్ధ విద్యలతోపాటు.. శారీరక వ్యాయామాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. క్షతగాత్రుల వద్దకు మావోయిస్టులు కొండలు, గుట్టలు, అడవుల నుంచి పరుగెత్తుకొచ్చిన తీరును బట్టి.. ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోందని భద్రతా బలగాల ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు

 ఛత్తీ‌సగఢ్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడి, బీజాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాన్‌ చెప్పిన మాటలను బట్టి ఇదే నిజమవుతోంది. ‘‘వాళ్లు అంతా పొడవుగా ఉన్నారు సార్‌..! వారిపై ఫైర్‌ చేస్తున్నా.. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించి.. జంకు లేకుండా నిలబడ్డారు..! ఏ ఒక్కరూ పొట్టిగా కనిపించలేదు..! అంతా బలంగా ఉన్నారు..! భారీ కసరత్తు, శిక్షణ తీసుకున్న వారిలా కనిపించారు. అలాంటి వారిని మావోయిస్టుల్లో ఎన్నడూ చూడలేదు.’ అని ఆ జవాను చెప్పారు.

‘‘మాకు వాళ్లు అతి దగ్గరగా వచ్చారు. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపినా.. వాళ్లకు చిన్న గాయం కూడా కాలేదు. ముఖంలో భయం కనిపించలేదు. అంతా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించారు’’ అని మరో జవాను చెప్పడాన్ని బట్టి పీఎల్‌జీఏ దళాలు ప్రత్యక్ష యుద్ధానికి అవసరమైన శిక్షణ తీసుకున్నట్లు అర్థమవుతోంది.

‘‘మావోయిస్టుల్లో అలాంటివాళ్లను ఇంతవరకు చూడలేదు. చూడడానికే రాక్షసుల్లా కనిపించారు. ఇంతకుముందు కూంబింగ్‌లలో మావోయిస్టులు తారసపడ్డా బక్కచిక్కి కనిపించారు. ఆదివారం నాటి ఘటనలో మావోయిస్టులు భిన్నంగా ఉన్నారు’’ అని ఆ జవాను వెల్లడించారు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయాలను నిర్ధారిస్తున్నారు. మావోయిస్టులు ఈ ఆపరేషన్‌ కోసం బలంగా ఉన్నావారినే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.



అధిపురుష్ సినిమాలో విఎఫ్ఎక్స్ కి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు??

టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!

వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్... వాళ్లకు తెగ నచ్చేసిందట !

వకీల్ సాబ్ చిత్రంలో ఆ 25 నిమిషాలు చాలా కీలకమట..

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181

త‌మిళ పోరు: డీఎంకే అడ్డంగా బుక్క‌వుతోందా ?

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>