Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aaharamea513228-00e3-40f7-a8cd-932e2654d337-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aaharamea513228-00e3-40f7-a8cd-932e2654d337-415x250-IndiaHerald.jpgఒకసారి మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలంటే మన గట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండాలి లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండు దశాబ్దాలుగా గట్ ఆరోగ్యం మీద ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే గట్ ఆరోగ్యం, మానసిక, శారీరక పరిస్థితితో పాటు రోగనిరోధక వ్యవస్థ పై ఆధారపడి ఉంటుంది. గట్ మైక్రోబియమే అంటే మన శరీరంలో ఉండే ప్రేగులలో ఉండే సూక్ష్మజీవులు. ఒక వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థలో సుమారు మూడు వందల నుంచి ఐదు వందల వరకు వివిధ రకాల జాతులకు సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిలో కొన్ని బాక్టీరియాలు aaharam;health;samatha;tara;idili;heart;sugar;garlic;aqua;office;yoga;cheese;manamతిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వడం లేదా.....?తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వడం లేదా.....?aaharam;health;samatha;tara;idili;heart;sugar;garlic;aqua;office;yoga;cheese;manamTue, 06 Apr 2021 06:00:00 GMTఒకసారి మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలంటే మన గట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండాలి లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండు దశాబ్దాలుగా గట్ ఆరోగ్యం మీద ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే గట్ ఆరోగ్యం, మానసిక, శారీరక పరిస్థితితో పాటు రోగనిరోధక వ్యవస్థ పై ఆధారపడి ఉంటుంది. గట్ మైక్రోబియమే అంటే మన శరీరంలో ఉండే ప్రేగులలో ఉండే సూక్ష్మజీవులు. ఒక వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థలో సుమారు మూడు వందల నుంచి ఐదు వందల వరకు వివిధ రకాల జాతులకు సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిలో కొన్ని బాక్టీరియాలు మనకి అవసరం వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ రకమైన బ్యాక్టీరియా ఉండకపోతే మనం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వడం కష్టమే. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా మనం తినే ఆహారాన్ని చిన్న చిన్న వాటిగా మారుస్తుంది. దాంతో మన శరీరం పోషక విలువలను తీసుకుంటుంది.



ప్రోబయాటిక్ ఫుడ్స్ కీ ఇంటెస్టెయినల్ హెల్త్ కీ దగ్గర సంబంధం ఉంది. పెరుగు, చీజ్, ఇడ్లీ, దోసె, పచ్చళ్ళు వంటివి గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే, బార్లీ, యాపిల్స్, హోల్ గ్రెయిన్స్, క్యారెట్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పప్పులు, గోధుమ.. ఇవన్నీ కూడా తీసుకోదగినవే. వారానికి 150 నిమిషాల ఎక్సర్సైజ్ చేయడం అనేది గట్ హెల్త్ కే కాదు హార్ట్ హెల్త్ కి కూడా ఎంతో మంచిది. మీకు వీలుగా ఉండే ఏ వ్యాయమైనా సరే, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, లేదా ఏదైనా స్పోర్ట్ ఆడడం వంటివన్నీ ఇందుకు హెల్ప్ చేస్తాయి.
 ఒత్తిడి శరీరం మొత్తాన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. పైగా ఒత్తిడి పెరిగినప్పుడు ప్రోబయాటిక్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. మెడిటేషన్, యోగా వంటి వాటి ద్వారా ఒత్తిడి కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.



మన ఆహారంలో షుగర్ పాత్ర ఎక్కువైపోతోంది. తియ్యని పదార్ధం కాకపోయినా కూడా షుగర్ ఉంటోంది. సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లో షుగర్ ఎక్కువగానే ఉంటుంది. వీటిని తగ్గించడం అవసరం. అలాగే, ఆర్టిఫిషియల్ స్వీటెర్నర్స్ కూడా గట్ హెల్త్ కి మంచిది కాదు. శరీరం ఒక బయలాజికల్ క్లాక్ ని ఫాలో అవుతుంది. ఈ క్లాక్ ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుంది, అరుగుదల, నిద్ర వంటి వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. మీరు సరైన నిద్ర లేకపోతే సరిగ్గా అరగదు. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, కొన్ని జీవన శైలి అలవాట్ల వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి ఈ చెయిన్ ని బ్రేక్ చేయాలంటే సరైన ఆహారం తీసుకుని సరిగ్గా నిద్ర పోవడమే పద్ధతి. ఒకే సమయానికి నిద్ర పోయి ఒకే సమయానికి లేవడం, నిద్ర కి గంట ముందు నించే స్క్రీన్ కి దూరంగా ఉండడం వంటి కొన్ని అలవాట్లు హెల్ప్ చేస్తాయి.


 రాత్రి డిన్నర్ ముగించిన తరువాత మరునాడు పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ వరకూ ఏమీ తినకుండా ఉండడం వల్ల ఎన్నో జీర్ణ సమస్యలు తలెత్తవు. రాత్రి ఎనిమిదీ తొమ్మిదింటికి డిన్నర్ అయిపోతే మళ్ళీ మరునాడు పొద్దున్న ఎనిమిదీ తొమ్మిదికి బ్రేక్ ఫాస్ట్ చేసేవరకూ ఏమీ తినకుండా ఉంటే గట్ లైనింగ్ స్ట్రాంగ్ గా తయారవుతుంది.అప్పుడప్పుడూ ఆల్కహాల్ తీసుకున్నా పరవాలేదు కానీ ఎక్కువగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ ఎక్కువయితే కాన్స్టిపేషన్, బ్లోటింగ్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.


స్నాక్స్ అనగానే మనకి బయట కొనే స్నాక్స్ మాత్రమే గుర్తొస్తాయి. పండు, నట్స్ వంటివి కూడా స్నాక్ గా తీసుకోవచ్చు. ఇంట్లో చేసిన స్నాక్స్ తినవచ్చు. మీరు ఆఫీసుకి వెళ్ళేప్పుడు స్నాక్స్ కూడా ఇంటినుండే పట్టుకుని వెళ్ళండి, అప్పుడు అన్‌హెల్దీ స్నాక్స్ జోలికి వెళ్ళకుండా ఉంటారు.పెయిన్ కిల్లర్స్ మనందరి దగ్గరా ఉంటాయి, ఎప్పుడైనా అవసరమైతే గబుక్కున ఒకటి నోట్లో వేసుకోవడానికి. చాలా సార్లు ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకునేది తలనొప్పికే. ఇంక నుండీ రెండు విషయాలు గుర్తు పెట్టుకోండి, పెయిన్ కిల్లర్స్ గట్ హెల్త్ ని దెబ్బ తీస్తాయి, చాలా సార్లు శరీరంలో నీటి శాతం తగ్గినా తలనొప్పి వస్తుంది. కాబట్టి, ఈ సారి తలనొప్పిగా ఉన్నప్పుడు ముందు రెండు గ్లాసుల మంచినీరు తాగి చూడండి.


ఫ్యాడ్ డైట్స్ గట్ హెల్త్ కి మంచిది కాదు. సాధారణంగా ఈ ఫ్యాడ్ డైట్స్ అన్నీ బరువు తగ్గడానికే ఫాలో అవుతారు. చాలా రకాల ఫ్యాడ్ డైట్స్ లో ఏదో ఒక ఫుడ్ గ్రూప్ తీసుకోకూడదు. ఇలా చేస్తే ఆ ఫుడ్ గ్రూప్ నించి వచ్చే బెనిఫిట్స్ మిస్ అవుతున్నట్లే. సమతులాహారం తీసుకుంటూ, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గే పద్ధతిని ఫాలో అవ్వండి.ఫ్యాడ్ డైట్స్ గట్ హెల్త్ కి మంచిది కాదు. సాధారణంగా ఈ ఫ్యాడ్ డైట్స్ అన్నీ బరువు తగ్గడానికే ఫాలో అవుతారు. చాలా రకాల ఫ్యాడ్ డైట్స్ లో ఏదో ఒక ఫుడ్ గ్రూప్ తీసుకోకూడదు. ఇలా చేస్తే ఆ ఫుడ్ గ్రూప్ నించి వచ్చే బెనిఫిట్స్ మిస్ అవుతున్నట్లే. సమతులాహారం తీసుకుంటూ, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గే పద్ధతిని ఫాలో అవ్వండి



రష్మిక మందన గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు.....?

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?

ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..ఎలా తట్టుకుంటాడో ?

టాలీవుడ్ లో 9 భాషల్లో రీమేక్ అయినా తెలుగు తొలి చిత్రం ఏదో మీకు తెలుసా....?

కేశినేని సైలెంట్...కుమార్తె హైలైట్...అసలు మేటర్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>