PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rafale-scam6bbe8874-5c7f-4d20-b9c9-129ba3413566-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rafale-scam6bbe8874-5c7f-4d20-b9c9-129ba3413566-415x250-IndiaHerald.jpgరఫేల్ యుద్ధ విమానాలు.. భారత సైన్యం స్థైర్యం పెంచేందుకు ఫ్రాన్స్ నుంచి ఈ యుద్ధ విమానాలు ఇండియా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ యుద్ధ విమానాల ఒప్పందంలో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణ ఏళ్ల తరబడి వినిపించింది. ఈ ఆరోపణల వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అయితే ఎక్కడా మోడీ సర్కారుకు ఎదురుదెబ్బ తగల్లేదు. సుప్రీంకోర్టు కూడా అవినీతి జరిగినట్టు ఆధారాలు లేవని తేల్చింది. అందుకే కొన్నాళ్లుగా ఈ రఫేల్ కుంభకోణం అంశం మరుగునపడిపోయింది. అయితే ఇప్పుడు ఓ ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా మరోసారి rafale-scam;modi;bharatiya janata party;india;france;narendra modi;mohandas karamchand gandhi;congress;media;minister;contract;central government;kathanam;shatru1;racchaమళ్లీ రఫేల్‌ గొడవ.. ఈసారైనా కాంగ్రెస్‌కు లాభిస్తుందా..?మళ్లీ రఫేల్‌ గొడవ.. ఈసారైనా కాంగ్రెస్‌కు లాభిస్తుందా..?rafale-scam;modi;bharatiya janata party;india;france;narendra modi;mohandas karamchand gandhi;congress;media;minister;contract;central government;kathanam;shatru1;racchaTue, 06 Apr 2021 10:13:00 GMTఫ్రాన్స్ నుంచి ఈ యుద్ధ విమానాలు ఇండియా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ యుద్ధ విమానాల ఒప్పందంలో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణ ఏళ్ల తరబడి వినిపించింది. ఈ ఆరోపణల వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అయితే ఎక్కడా మోడీ సర్కారుకు ఎదురుదెబ్బ తగల్లేదు. సుప్రీంకోర్టు కూడా అవినీతి జరిగినట్టు ఆధారాలు లేవని తేల్చింది.

అందుకే కొన్నాళ్లుగా ఈ రఫేల్ కుంభకోణం అంశం మరుగునపడిపోయింది. అయితే ఇప్పుడు ఓ ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా మరోసారి రచ్చ మొదలైంది. దీంతో భారత సుప్రింకోర్టు దీనిపై తీర్పు ఇచ్చినా.. ఇంకా  అనుమానాల నీడలు ముసురుతూనే ఉన్నాయి. తాజాగా ఫ్రెంచ్ మీడియా ఏం చెబుతుందంటే.. భారత్‌ – ఫ్రాన్స్‌ మధ్య కుదిరిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారిందట. ఫ్రెంచ్‌ ఆన్‌లైన్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నల్‌ ‘మీడియాపార్ట్‌’ఈ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.

అసలు విషయం ఏంటంటే.. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ కంపెనీ రఫేల్‌ ఫైటర్‌ జెట్లను తయారుచేస్తోంది. వీటిని కొనేందుకు భారత్‌ 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందంచేసుకుంది. ఈ డీల్‌ కుదరడానికి సహకరించినందుకు భారత్‌లోని మధ్యవర్తులైన సుశేన్‌ గుప్తాకు డసాల్ట్‌ 1.1 మిలియన్‌ యూరోలు.. అంటే మన కరెన్సీలో9.5 కోట్లు కమీషన్లుగా చెల్లించిందట. ఈ విషయాన్ని ‘మీడియాపార్ట్‌’ ప్రచురించింది. ఇప్పుడు ఇది మరోసారి రాజకీయ దుమారానికి కారణమవుతోంది.

రఫెల్‌ కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని గత కొంత కాలంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలు సత్యమని ఈ కథనంతో రుజువైందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.  మోదీ ఇప్పుడు దేశానికి ఏ సమాధానం చెబుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా  ప్రశ్నిస్తున్నారు. ఎవరికి ఎంత మేరకు ముడుపులు చెల్లించారో పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. రఫెల్‌ డీల్‌లో ముడుపుల ఆరోపణలు నిరాధారమైనవని, కొన్ని కంపెనీల మధ్య శత్రుత్వం వల్ల ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ  నేత రవిశంకర్‌ ప్రసాద్‌ వివరణ ఇచ్చారు.




వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !

అనామకులు చెప్తే నేను ఎందుకు వినాలి: నాగార్జున ఫైర్

వైసీపీ ఎంపీ అభ్యర్ధిపై దారుణ వ్యాఖ్య చేసిన లోకేష్...!

పాతికేళ్లు దాటిన వారికి టీకా.. తెర మీదికి కొత్త డిమాండ్..?

సారంగ‌ద‌రియా సాంగ్ ఇప్ప‌టిది కానే కాదు...70 ఏళ్ల కింద‌టే ఆ పాట ఫేమ‌స్‌...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>