PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-vijayamma7103f2ad-833a-41e9-9f6a-3f2427f4c315-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-vijayamma7103f2ad-833a-41e9-9f6a-3f2427f4c315-415x250-IndiaHerald.jpgరాజకీయంగా వైఎస్ కుటుంబంపై ఆరోపణలు, విమర్శలకు సమాధానంగా.. ఏపీ సీఎం జగన్ తల్లి వియమ్మ రాసిన ఐదు పేజీల బహిరంగ లేఖ కాస్త కలకలం సృష్టించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగడం లేదంటూ సునీతారెడ్డి మీడియాకు ఎక్కిన రెండు రోజులకే విజయమ్మ ఈ లేఖ రాయడం విశేషం. అయితే సునీతారెడ్డి ఆరోపణలు జగన్‌కు చేటు తేకుండా వివరణ ఇచ్చుకునేందుకు విజయమ్మ లేఖ రాశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ లేఖ షర్మిలకూ చాలా సంతోషం కలిగించేలా ఉంది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయాన్ని విజయమ్మ సమర్థిస్తున్నట్టే కనిపిస్తys-vijayamma;pawan;deva;kalyan;kushi;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;congress;adinarayanareddy;2019;cm;y s vivekananda reddy;cbi;minister;letter;murder.;reddy;party;adinarayana reddyతల్లి వైఎస్‌ విజయమ్మ లేఖతో వైఎస్‌ షర్మిల ఫుల్‌ ఖుషీ..!?తల్లి వైఎస్‌ విజయమ్మ లేఖతో వైఎస్‌ షర్మిల ఫుల్‌ ఖుషీ..!?ys-vijayamma;pawan;deva;kalyan;kushi;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;congress;adinarayanareddy;2019;cm;y s vivekananda reddy;cbi;minister;letter;murder.;reddy;party;adinarayana reddyTue, 06 Apr 2021 08:00:00 GMTఏపీ సీఎం జగన్ తల్లి వియమ్మ రాసిన ఐదు పేజీల బహిరంగ లేఖ కాస్త కలకలం సృష్టించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగడం లేదంటూ సునీతారెడ్డి మీడియాకు ఎక్కిన రెండు రోజులకే విజయమ్మ ఈ లేఖ రాయడం విశేషం. అయితే సునీతారెడ్డి ఆరోపణలు జగన్‌కు చేటు తేకుండా వివరణ ఇచ్చుకునేందుకు విజయమ్మ లేఖ రాశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ లేఖ షర్మిలకూ చాలా సంతోషం కలిగించేలా ఉంది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయాన్ని విజయమ్మ సమర్థిస్తున్నట్టే కనిపిస్తోంది. షర్మిలమ్మ తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మిందని.. తెలంగాణ ప్రజలతో తన  అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని షర్మిల నమ్ముతోందని.. కాబట్టే షర్మిలమ్మ తెలంగాణలో ముందడుగు వేస్తోందని విజయమ్మ లేఖలో తెలిపారు. నా బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలని దిగజారుడు ప్రయత్నాలు కనిపిస్తున్నాయని.. అది ఏనాటికీ జరగని పని అని ఆమె చెప్పుకొచ్చారు.

పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు ముఖ్యమని వైఎస్ జగన్ భావించారని..వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను తెలంగాణలో నడిపించడం కుదరదని స్పష్టం చేశారని విజయమ్మ గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతపు కోడలిగా తాను ప్రజాసేవలో ఉండాలని షర్మిలమ్మ నిర్ణయించుకుందని.. అందువల్ల ఇవి వేర్వేరు అభిప్రాయాలే తప్ప వారిద్దరి మధ్య విభేదాలు కావని విజయమ్మ మరోసారి స్పష్టం చేశారు.

విజయమ్మ ఇంకా లేఖలో ఏంరాశారంటే.. “ వైఎస్ వివేకాను 2019 మార్చిలో ఎవరు హత్య చేశారో కచ్చితంగా నిగ్గుతేల్చాల్సిందే.. ఇది నామాట.. ఇదే జగన్ మాట.. ఇదే షర్మిల మాట.. ఇందులో మా కుటుంబంలో ఎవరికీ రెండు అభిప్రాయాలు లేవు.. చంద్రబాబు సీఎంగా ఉండగానే వైఎస్ వివేక హత్య జరిగింది.. హత్యలో అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయి. ఇప్పుడు భాజపా లో ఉన్న ఆయన్ను పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు.. వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐ విచారిస్తుంది... హత్యకేసు  కేంద్రప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ జగన్ పై విమర్శలు చేశారు.. సీబీఐ విచారణ వేగంగా చేయాలని సీఎం జగన్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. జగన్ సహా వైఎస్ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. అని రాశారు విజయమ్మ.


వైఎస్‌. ష‌ర్మిల పార్టీపై విజ‌య‌మ్మ స్పంద‌న ఇదే

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?

ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>