EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-pondichery-special-stauts-andhrapradesh-jagan-naidub1268dc9-244d-405a-8544-cea087e4fc43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-pondichery-special-stauts-andhrapradesh-jagan-naidub1268dc9-244d-405a-8544-cea087e4fc43-415x250-IndiaHerald.jpgనిజానికి యూపీఏ ఇచ్చిన హామీలో పార్లమెంటు పరంగా చూసినపుడు బీజేపీకి కూడా పాత్రుంది. అయినా సరే అధికారంలోకి రాగానే నరేంద్రమోడి తూచ్ అనేశారు. నిండు సభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని, చేసిన ప్రకటనను తర్వాత వచ్చిన మోడి లెక్క చేయలేదు. అలాగే ఇపుడు నిర్మల సీతారామన్ ఇఛ్చిన హామీని మోడి అమలు చేస్తారనే గ్యారెంటీలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయటంలో నరేంద్రమోడికి ఉన్న క్రెడిబులిటి, రిలయబులిటీ అంత స్ధాయిలో ఉందిమరి. ఇదే విషయాన్ని ఏపిలో జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ఏపి ప్రయోజనాలను దెబ్బకొట్టినట్లmodi pondichery special stauts andhrapradesh jagan naidu;amit shah;amala akkineni;manmohan;kerala;bharatiya janata party;nirmala sitharaman;andhra pradesh;narendra modi;manmohan singh;amith shah;congress;government;prime minister;minister;central governmentహెరాల్డ్ ఎడిటోరియల్ : ఏపిని చేసినట్లే పాండిచ్చేరిని కూడా మోసం చేస్తారా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏపిని చేసినట్లే పాండిచ్చేరిని కూడా మోసం చేస్తారా ?modi pondichery special stauts andhrapradesh jagan naidu;amit shah;amala akkineni;manmohan;kerala;bharatiya janata party;nirmala sitharaman;andhra pradesh;narendra modi;manmohan singh;amith shah;congress;government;prime minister;minister;central governmentTue, 06 Apr 2021 05:00:00 GMTఇపుడిదే చర్చ రెండు రాష్ట్రాల్లోను జరుగుతోంది. పాండిచ్చేరి ఎన్నికల్లో గెలవటం కోసం బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అందులో అనేక హామీలతో పాటు పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు. నిజానికి ఇంతటి కీలకమైన హామీని ఇస్తే గిస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఇవ్వాలి. అలా కానపుడు కనీసం హోంశాఖ మంత్రి అమిత్ షా అయినా ఇవ్వాలి. అంతేకానీ ఏ మంత్రిపడితే ఆ మంత్రి ఇచ్చేస్తే హామీలు చెల్లుబాటవుతాయని గ్యారెంటీలేదు. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ఇచ్చిన విభజన హామీలను తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఖాతరుచేయలేదు.




నిజానికి యూపీఏ ఇచ్చిన హామీలో పార్లమెంటు పరంగా చూసినపుడు బీజేపీకి కూడా పాత్రుంది. అయినా సరే అధికారంలోకి రాగానే నరేంద్రమోడి తూచ్ అనేశారు. నిండు సభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని, చేసిన ప్రకటనను తర్వాత వచ్చిన మోడి లెక్క చేయలేదు. అలాగే ఇపుడు నిర్మల సీతారామన్ ఇఛ్చిన హామీని మోడి అమలు చేస్తారనే గ్యారెంటీలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయటంలో నరేంద్రమోడికి  ఉన్న క్రెడిబులిటి, రిలయబులిటీ అంత స్ధాయిలో ఉందిమరి. ఇదే విషయాన్ని ఏపిలో జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ఏపి ప్రయోజనాలను దెబ్బకొట్టినట్లే, రేపు ఓట్లేయించుకున్న తర్వాత పాండిచ్చేరికి కూడా కేంద్రం చేసేదేమీ ఉండదనే చర్చ జరుగుతోంది.




పాండిచ్చేరిలో ఉన్నదే 34 సీట్లు. ఇప్పటివరకు ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని ఎప్పటినుండో బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తున్నా కుదరటంలేదు. ఏదో అప్పుడప్పుడు కర్నాటకలో మాత్రం అధికారంలోకి వస్తు, పోతుంటుంది. ఇఫుడున్న యడ్యూరప్ప ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలీకుండా ఉంది. అందుకనే ఇంకో రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే కేరళ, తమిళనాడు, తెలంగాణా, ఏపిలో కనుచూపులో అవకాశాలు కనబడటంలేదు. అందుకనే పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అస్తిరత్వాన్ని క్రియేట్ చేసింది. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో ఉంది. అందుకనే పాండిచ్చేరికి ప్రత్యేకహోదా అంటోంది. ఏపికి వచ్చేసరికి దేశంలో ఏ రాష్ట్రానికి హోదా ఇచ్చేది లేదని చెబుతున్న బీజేపీ పాండిచ్చేరికి మాత్రం ఎలా హామీఇచ్చింది ?




ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సాయి ధర్మ తేజ్ పవర్ ఫుల్ డైలాగ్....?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>