LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mangoes97ed2040-b47b-461b-b230-c01f28a0e1ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mangoes97ed2040-b47b-461b-b230-c01f28a0e1ef-415x250-IndiaHerald.jpgమామిడి కాయలు కేవలం ఎండాకాలంలో మాత్రమే కాపుకు వస్తాయి. తీయటి మామిడికాయల రుచి ఆస్వాదించాలంటే వేసవికాలం వరకు వేచి చూడాల్సిందే. ఐతే ఇకపై ఆ అవసరమే లేదని రాజస్థాన్‌ రాష్ట్రం కోటాకు చెందిన శ్రీకిషన్‌ సుమన్‌ అనే ఒక రైతు చెబుతున్నారు. ఆయన ఏడాది పొడవునా కాయలు కాసే ఒక సరికొత్త మేలురకమైన మామిడి రకాన్ని కనిపెట్టి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సదాబహార్‌ (సతతహరితం) పేరుతో రూపొందించిన ఈ సరికొత్త మామిడి రకం ఏడాది పొడుగునా తెగుళ్ళను, పురుగులను, వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని కాయలు ఇస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేmangoes;madhura sridhar reddy;suman;2020;central government;nijam;kamala harrisఏడాది పొడుగునా కాసే సరికొత్త మామిడి చెట్ల రకాన్ని కనిపెట్టిన రైతు..ఏడాది పొడుగునా కాసే సరికొత్త మామిడి చెట్ల రకాన్ని కనిపెట్టిన రైతు..mangoes;madhura sridhar reddy;suman;2020;central government;nijam;kamala harrisTue, 06 Apr 2021 16:07:04 GMTకేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కూడా ఒక ప్రకటనలో సుమన్ కనిపెట్టిన కొత్త రకం మామిడి చెట్టు గురించి సుదీర్ఘంగా వివరించింది.


నార్త్ ఇండియాలో పుష్కలంగా లభించే లంగడా మామిడికాయలతో పోలిస్తే సుమన్ కనిపెట్టిన మామిడి చెట్టు కాయలు చాలా చిన్నగా ఉంటాయని.. వీటిని పెరటిలో, కుండీలలో కూడా పెంచుకోవచ్చని.. ముదురు కమలా పండు వర్ణంలో ఉండే ఈ పండ్లు చాలా మధురంగా ఉంటాయని.. దీంతోపాటు ఈ మామిడి పండులో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడించింది.


ఏడాది పొడుగుతా కాసే సరికొత్త మామిడిరకం కనిపెట్టడం వెనుక శ్రీ కిషన్ సుమన్ యొక్క మేధోసంపత్తి ఎంతో ఉందని.. రెండవ తరగతితో చదువు మానేసిన సుమన్ 2000 సంవత్సరంలో తన తోటలో ఏడాది పొడవునా కాయలిచ్చే ఒక చెట్టుని కనిపెట్టారని.. అదే చెట్టుకి ఐదు అంట్లు కట్టి.. కొత్త రకాల చెట్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి.. వాటిని 15 సంవత్సరాల పాటు భద్రపరిచి.. చివరికి ఒక సరికొత్త మామిడి రకాన్ని కనిపెట్టారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది.


15 సంవత్సరాల పాటు ఎన్నో పరిశోధనలు చేసి సరికొత్త మామిడి చెట్టు రకాన్ని కనిపెట్టడం నిజంగా అభినందనీయం. ఆయన అంటుకట్టిన మామిడి చెట్టు రెండో సంవత్సరం లోనే కాయలు కాయడం గమనించిన నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌.. రాష్ట్రపతి భవన్‌లోని మొగల్‌ గార్డెన్‌లో ఆ మొక్కలను నాటేందుకు చొరవ తీసుకుంది. అయితే ఈ కొత్త రకం మామిడి చెట్ల కోసం 2017 నుంచి 2020 సంవత్సరాల మధ్య కాలంలో 8000 ఆర్డర్స్ కూడా వచ్చాయి. దీంతో 6000 మామిడి చెట్లను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేశారు. అంతేకాకుండా 400 అంటు మొక్కలను వివిధ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు పంపించారు.


బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి, జెడ్పీటిసి ఎన్నికలను నిలిపివేసిన హైకోర్ట్..!

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం

తెరాసలో కొత్త సమస్య...?

జగన్ పై విమర్శలు చేస్తున్నా ఎందుకు మాట్లాడట్లేదు...?

టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>