MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amitash75d32c57-6afb-440b-89ae-2161ad532e29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amitash75d32c57-6afb-440b-89ae-2161ad532e29-415x250-IndiaHerald.jpgయంగ్ విలన్ అమితాష్ ప్రధాన్ గురించి తెలిసే ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ సినిమాలో విలన్ సంపత్ రాజ్ కొడుకు పాత్రలో చేసింది ఇతనే. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో బాగా డిమాండ్ ఉన్న నటుడు అమితాష్. హీరో ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ రఘువరన్ బీటెక్ సినిమాలో విలన్ పాత్ర చేసి ప్రేక్షకుల ఆదరణ పొందాడు. Amitash;business;chiranjeevi;dhanush;geetha;pawan kalyan;raghu;raghuvaran;raj;sampath;industries;cinema;sangeetha;tamil;hollywood;kannada;film industry;chennai;wife;october;hero;father;mahaహాలీవుడ్ ఛాన్స్ కొట్టిన విలన్ అమితాష్ తండ్రి ఎవరో తెలుసా..?హాలీవుడ్ ఛాన్స్ కొట్టిన విలన్ అమితాష్ తండ్రి ఎవరో తెలుసా..?Amitash;business;chiranjeevi;dhanush;geetha;pawan kalyan;raghu;raghuvaran;raj;sampath;industries;cinema;sangeetha;tamil;hollywood;kannada;film industry;chennai;wife;october;hero;father;mahaTue, 06 Apr 2021 07:00:00 GMTపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ సినిమాలో విలన్ సంపత్ రాజ్ కొడుకు పాత్రలో చేసింది ఇతనే. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో బాగా డిమాండ్ ఉన్న నటుడు అమితాష్. హీరో ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ రఘువరన్ బీటెక్ సినిమాలో విలన్ పాత్ర చేసి ప్రేక్షకుల ఆదరణ పొందాడు. అమితాష్ ఇప్పటివరకు కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే నటించాడు. అయితే చిన్న వయసులోనే (27ఏళ్లు) హాలీవుడ్‌లో ఛాన్స్ కొట్టాడంటే ఇతడి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్రూస్‌లీ సినిమా చేస్తున్నప్పుడే అమితాష్‌కు హాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. అమితాష్ 1990 అక్టోబర్ 12వ తేదీన చెన్నైలో జన్మించాడు. అమితాష్ తండ్రి కూడా ఒకప్పటి హీరో గిరీష్.

కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘సప్తపది’లో నటించిన గిరిష్.. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ఆదరణను పొందాడు. ఈ సినిమాలో సంగీత విద్వాంసుడిగా కనిపించాడు. కర్ణాటకకు చెందిన గిరీష్ బీఎస్సీ వరకు చదివాడు. సినిమాలపై ఆసక్తితో ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరి శిక్షణ తీసుకున్నాడు. గిరీష్ తొలిచిత్రం కళాత్మక చిత్రం కావడంతో ఈ తర్వాత కూడా అలాంటి పాత్రలు ఉన్న సినిమాలల్లోనే ఛాన్సులు వచ్చాయి. అయితే సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మార్చినప్పుడు ఆయన చెన్నైలోనే ఉండిపోయాడు. గిరీష్.. మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. వీరిద్దరూ కలిసి మంచు పల్లకి సినిమాలో నటించారు. అయితే అప్పట్లో గిరీష్‌ని గిరి అని చిరంజీవి పిలిచేవాడట. గిరీష్‌ కూడా చిరంజీవిని చిరు అని పిలిచేవాడట. అలా చిరంజీవిని చిరు అని పిలిచిన మొదటి వ్యక్తి గిరీషే. అలా అది చిరంజీవికి ముద్దు పేరుగా మారిపోయింది.

గిరీష్‌కి పుస్తకాలు చదవడమంటే మహా సరదా. అప్పట్లో చిరంజీవి మద్రాసులో ఇళ్లు కడుతున్నప్పుడు ఇంట్లో లైబ్రరీ డిజైన్ చేయమని గిరీష్‌కు బాధ్యత అప్పగించాడట. అలాగే మంచి పుస్తకాల పేర్లు కూడా రాయించుకున్నాడట. వీరిద్దరి బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం గిరీష్ ఫార్మా ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. గిరీష్ భార్య పేరు వీణా. వీరిద్దరి ఒక్కడే కొడుకు అమితాష్.


ఆ ఇద్దరు దర్శకులను టెన్షన్ పెడుతున్న చిరంజీవి ?

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?

ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>