PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan46baf01d-f591-4261-a975-b22dfdfe3f16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan46baf01d-f591-4261-a975-b22dfdfe3f16-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. దానికి తగినట్లుగా తిరుపతి వచ్చి పాదయాత్ర చేశారు. ఒక సభలో కూడా పాల్గొన్నారు. ఆ సభ జనాలతో దుమ్ము దులిపేసింది. దాంతో ఇపుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కొత్త రూపూ షేపూ మార్చుకుంది. పవన్ ఫ్యాక్టర్ తిరుపతిలో ఎంత అన్నది ఇపుడు అధికార పక్షాన్ని కలవరపెడుతున్న అతి పెద్ద రాజకీయ అంశం pawan;pawan;nani;kalyan;tiru;bharatiya janata party;janasena;tirupati;perni nani;assembly;minister;air;husband;ycp;janasena party;party;mantraపవన్ అంటే వైసీపీకి జడుపేనా...?పవన్ అంటే వైసీపీకి జడుపేనా...?pawan;pawan;nani;kalyan;tiru;bharatiya janata party;janasena;tirupati;perni nani;assembly;minister;air;husband;ycp;janasena party;party;mantraTue, 06 Apr 2021 10:30:00 GMTపవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. దానికి తగినట్లుగా తిరుపతి వచ్చి పాదయాత్ర చేశారు. ఒక సభలో కూడా పాల్గొన్నారు. ఆ సభ జనాలతో దుమ్ము దులిపేసింది.

దాంతో ఇపుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కొత్త రూపూ షేపూ మార్చుకుంది. పవన్ ఫ్యాక్టర్ తిరుపతిలో ఎంత అన్నది ఇపుడు అధికార పక్షాన్ని కలవరపెడుతున్న అతి పెద్ద రాజకీయ అంశం. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బలిజలు ఉన్నారు. వారితో పాటుగా ఇతర అసెంబ్లీ సీట్లలో కూడా బలిజల బలం గట్టిగానే ఉంది. కనీసంగా మూడు నియోజకవర్గాల్లో పవన్ జనసేన పార్టీ తన ప్రతాపం చూపిస్తుంది అంటున్నారు.

ఇపుడు ఇవే లెక్కలు ఫ్యాన్ పార్టీకి నిద్ర పట్టనీయడంలేదుట. తిరుపతిలో గెలుపు ఖాయమని వైసీపీ పెద్ద లెక్కలే వేసుకుంది. ఇప్పటికే గెలుపు విషయంలో వైసీపీకి ఢోకా లేకపోయినా మెజారిటీ దారుణంగా తగ్గితే మాత్రం అది గెలిచి ఓడినట్లు అవుతుంది అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో వైసీపీ పవన్ ఫ్యాక్టర్ ని తిరుపతి ఉప ఎన్నికల్లో  తగ్గించడానికి ఇద్దరు మంత్రులను రంగంలోకి దింపింది.

ఆ ఇద్దరు మంత్రులు నోరున్న పేరున్న వారే. అందులో పేర్ని నాని అయితే బాగానే సెటైర్లు వేస్తారు. పవన్ మీద అపుడే విరుచుకుపడిపోతున్నారు  పవన్ నాయుడు అంటూ ఏకంగా జనసేన గాలి తీసే ప్రయత్నం చేశారు. మరో వైపు ఇంకో మంత్రి కురసాల కన్నబాబు అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అవగాహన  లేకుండా మాట్లాడుతున్నారు అంటూ గట్టిగానే తగులుకున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు మంత్రుల బాధ్యత ఏంటి అంటే కాపుల ఓట్లు బీజేపీకి పోకుండా కాపు కాయడం. మరి అది జరిగేనా. పవన్ ఫ్యాక్టర్ తో కమలానికి ఆ ఓట్లు టర్న్ అవుతాయా అన్నది చూడాల్సిందే. ఏది ఏమైనా తిరుపతిలో పెద్ద సభ పెట్టి మరీ బీజేపీ జనసేన ఇతర పార్టీలకు షాక్ ఇచ్చాయనే చెప్పాలి.





పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !

శృతి హాసన్ కి అన్యాయం చేసిన వకీల్..?

మెగాస్టార్ కోసం బెంగాల్ ను కేరళగా మార్చారా...?

వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !

పవన్ కోసం చిరు ప్రచారానికి వస్తారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>