Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanaidu08545b87-5818-4503-973e-90940a141747-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanaidu08545b87-5818-4503-973e-90940a141747-415x250-IndiaHerald.jpgఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చాలా స్పష్టమైన తీర్పు వస్తుందని అందరూ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన రాష్ట్రం తమిళనాడు. అయితే ప్రచారం నువ్వానేనా అన్నట్టుగా సాగిస్తున్నాయి. అక్కడ ద్రవిడ దిగ్గజాలు ఇద్దరూ లేకుండా జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ఒక్కడే లీడర్‌గా ప్రజల ముందు నిలబడ్డారు. అయితే ఏకపక్షంగా ఆయనకు ప్రజలు మద్దతివ్వడానికి బీజేపీనే కారణంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన వారికి కూడా ఓట్లేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ పట్టు బట్టి అన్నాడీఎంకేతో పొత్తుtamilanaidu;modi;amit shah;udhayanidhi stalin;delhi;bharatiya janata party;amith shah;tamil;tamilnadu;stalinతమిళనాడులో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాబోతోంది....?తమిళనాడులో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాబోతోంది....?tamilanaidu;modi;amit shah;udhayanidhi stalin;delhi;bharatiya janata party;amith shah;tamil;tamilnadu;stalinTue, 06 Apr 2021 00:00:00 GMT
ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చాలా స్పష్టమైన తీర్పు వస్తుందని అందరూ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన రాష్ట్రం తమిళనాడు. అయితే ప్రచారం నువ్వానేనా అన్నట్టుగా సాగిస్తున్నాయి. అక్కడ ద్రవిడ దిగ్గజాలు ఇద్దరూ లేకుండా జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ఒక్కడే లీడర్‌గా ప్రజల ముందు నిలబడ్డారు. అయితే ఏకపక్షంగా ఆయనకు ప్రజలు మద్దతివ్వడానికి బీజేపీనే కారణంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన వారికి కూడా ఓట్లేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ పట్టు బట్టి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని.. కొన్ని సీట్ల అయినా సరే తీసుకుని పోటీ చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా… ప్రచారంలో కూడా చురుగ్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు మోడీ, అమిత్ షా.


ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకున్న డీఎంకే.,.. మరింత విస్తృతంగా మోడీ, అమిత్ షాలను అన్నాడీఎంకే తరపున ప్రచారం చేయాలని సెటైర్లు వేసేంత పరిస్థితి వచ్చింది. పరిస్థితిని… అన్నాడీఎంకే నేతలు..బీజేపీకి చెప్పే పరిస్థితి లేదు. అదే సమయంలో మోడీ, అమిత్ షాలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. వారు తరచూ ప్రచారం చేశారు. ఫలితంగా… సోషల్ మీడియాలో వారు తమిళనాడు వచ్చినప్పుడల్లా.. గో బ్యాక్ మోడీ, అమిత్ షా లు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ పరిస్థితులకు తోడు… ఎన్నికలకు మూడు, నాలుగు రోజుల ముందు స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటీదాడులు చేయించడం కలకలం రేపింది.


స్టాలిన్ అల్లుడు అంటూ ప్రచారం చేయించినా.. కుమార్తెను అమిత్ షా టార్గెట్ చేశారన్న అభిప్రాయం తమిళుల్లో ఏర్పడింది. దీంతో ఢిల్లీ నాయకత్వంపై మరింత ఆగ్రహం తమిళుల్లో ప్రారంభమయింది. చివరికి స్టాలిన్‌కు ఈ ఎన్నికల్లో ఉన్న ప్లస్ పాయింట్లకు తోడు… బీజేపీ నేతలు మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. ఫలితంగా స్టాలిన్ గెలుపు నల్లేరుపై నడకలాగా మారిపోయిందన్న అభిప్రాయం… తమిళనాడులోనే కాదు.. అంతటా వ్యక్తమవుతోంది.



మరికొద్ది గంటల్లోనే పోలింగ్.. ఏకంగా రూ. 428 కోట్లు సీజ్ !

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>