MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shocking-gossip-on-pavan-and-trivikram-moviee4eead69-e431-463f-9e88-d394a2545445-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shocking-gossip-on-pavan-and-trivikram-moviee4eead69-e431-463f-9e88-d394a2545445-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న మూవీ ఇప్పుడు ఆగిపోయిందా అంటూ కొన్ని గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చి సంవత్సరం దాటిపోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి కాగానే ఈమూవీ షూటింగ్ మొదలవుతుంది అని భావించడమే కాకుండా ఈమూవీ కథకు సంబంధించిన వార్తలు అదేవిధంగా ఈమూవీ టైటిల్ ప్రచారంలోకి వచ్చాయి.అంతేకాదు ఈమూవీలో హీరోయిన్ గా నటించే గ్లామర్ బ్యూటీల పేర్ల పై కూడ ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుjunior ntr;;mahesh;ntr;pooja hegde;jr ntr;srinivas;trivikram srinivas;rrr movie;cinema;industry;director;heroine;nandamuri taraka rama rao;darsakudu;lieజూనియర్ త్రివిక్రమ్ ల మూవీ పై నీలి నీడలు ?జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ పై నీలి నీడలు ?junior ntr;;mahesh;ntr;pooja hegde;jr ntr;srinivas;trivikram srinivas;rrr movie;cinema;industry;director;heroine;nandamuri taraka rama rao;darsakudu;lieTue, 06 Apr 2021 10:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న మూవీ ఇప్పుడు ఆగిపోయిందా అంటూ కొన్ని గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చి సంవత్సరం దాటిపోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి కాగానే ఈమూవీ షూటింగ్ మొదలవుతుంది అని భావించడమే కాకుండా ఈమూవీ కథకు సంబంధించిన వార్తలు అదేవిధంగా ఈమూవీ టైటిల్ ప్రచారంలోకి వచ్చాయి.


అంతేకాదు ఈమూవీలో హీరోయిన్ గా నటించే గ్లామర్ బ్యూటీల పేర్ల పై కూడ ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అసలు ఈమూవీ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ హడావిడి చేస్తున్న గాసిప్పులను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈలీకుల ప్రకారం జూనియర్ త్రివిక్రమ్మూవీ ఆగిపోవడానికి గల కారణం ఈమూవీకి సరైన కథ దొరకకపోవడం అని అంటున్నారు.


ముందుగా త్రివిక్రమ్ మార్పులు చేసిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ కథ జూనియర్ కు మొదట్లో నచ్చినా ఆతరువాత అతడి ఆలోచనలలో మార్పులు వచ్చి మంచి ఫ్యామిలీ టైపు మూవీ కావాలని అడగడంతో త్రివిక్రమ్ జూనియర్ కు రెండు మూడు కథలు వినిపించినట్లు టాక్. అయితే ఆ రెండు కథలు నచ్చక మరో మంచి కథను ఆలోచించమని జూనియర్ త్రివిక్రమ్ కు సూచించాడు అని అంటున్నారు.


దీనితో త్రివిక్రమ్ సున్నితంగా ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత మరొక దర్శకుడుతో జూనియర్ సినిమాను ప్లాన్ చేసుకోమని ఈలోపున తాను మరో మంచి కథను ఆలోచిస్తాను అంటూ త్రివిక్రమ్ చెప్పాడు అంటూ లీకులు హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు మహేష్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ మూవీకి రంగం సిద్ధం అయిందని ఈమూవీ అధికారిక ప్రకటన ఉగాది రోజున ఉంటుంది అని అంటున్నారు. ‘సర్కారువారి పాట’ మూవీ షూటింగ్ రాబోతున్న జూలై కి పూర్తి అవుతున్న పరిస్థితులలో జూనియర్ కథ గురించి ఆలోచనలు చేస్తూనే ఈలోపున మహేష్ తో మూవీని వేగంగా పూర్తి చేయాలి అన్న ఆలోచనలతో మహేష్ మూవీ ముందుకు జూనియర్ మూవీ వెనక్కు వెళ్ళింది అంటూ ఇండస్ట్రీ గాసిప్పుల హడావిడి..







ఎమ్మెల్యే రోజా బాలీవుడ్ లో నటించిన ఏకైక చిత్రం ఏదో తెలుసా...?

ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ సీట్ల‌పై నేత‌ల గురి... సిట్టింగ్ టీఆర్ ఎస్ నేత‌ల్లో టెన్ష‌న్‌...

పవన్ కళ్యాణ్ తరవాత ట్రెండింగ్ లో బండ్ల..!

వ‌కీల్ సాబ్ బాక్సాఫీస్ టార్గెట్ ఎన్ని కోట్లంటే...

ష‌ర్మిల పార్టీకి స‌భ క‌ష్టాలు... పెరుగుతున్న అనుమానాలు... ఎందుకంటే...?

వైఎస్‌. ష‌ర్మిల పార్టీపై విజ‌య‌మ్మ స్పంద‌న ఇదే

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>