PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cs-somesh-kumar-68184ba6-d34c-4591-bf37-1d74785d4401-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cs-somesh-kumar-68184ba6-d34c-4591-bf37-1d74785d4401-415x250-IndiaHerald.jpgసీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇటీవల ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్‌ సమీక్షల్లో పాల్గొంటున్నారు. సమీక్షా సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాస్క్ కూడా ధరించడం లేదు. cs somesh kumar;kcr;amala akkineni;kumaar;pragathi;telangana rashtra samithi trs;korcha;telangana;high court;cm;chief minister;grama sachivalayam;panjaaప్రగతి భవన్ లో టెన్షన్ టెన్షన్ప్రగతి భవన్ లో టెన్షన్ టెన్షన్cs somesh kumar;kcr;amala akkineni;kumaar;pragathi;telangana rashtra samithi trs;korcha;telangana;high court;cm;chief minister;grama sachivalayam;panjaaTue, 06 Apr 2021 19:00:16 GMTతెలంగాణలో రోజురోజుకు కరోనా పంజా విసురుతోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా భారీన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇటీవల  ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ఇటీవల తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణలు కనిపిస్తే వెంటనే  కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు.సీఎస్ కు కరోనా సోకడంతో తెలంగాణ సచివాలయంలో భయాందోళన నెలకొంది. కొన్నిరోజులగా సీఎస్ చాలా సమీక్షలు నిర్వహించారు. ఆయనతో సమావేశాలకు హాజరైన అధికారులంతా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.

సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇటీవల ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్‌ సమీక్షల్లో పాల్గొంటున్నారు. సమీక్షా సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాస్క్ కూడా ధరించడం లేదు. సీఎస్ తో ముఖ్యమంత్రికి సమీపంలోనే కూర్చుంటారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో ఆందోళన నెలకొంది. సీఎం కేసీఆర్ పరిస్థితిపై టీఆర్ఎస్ వర్గాలు కూడా ఆందోళనగా ఉన్నాయని తెలుస్తోంది.

మరోవైపు బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడంలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంది. నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలు వెల్లడిస్తూ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై నివేదిక సమర్పించింది.

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు అతితక్కువగా చేస్తున్నారని, పూర్తిగా ర్యాపిడ్‌ టెస్టులపైనే దృష్టి పెట్టారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 10 శాతం కూడా లేవని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ వివరణ ఇవ్వగా.. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది. 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్రెండింగ్ లో నిలుస్తున్న అల్లు అర్జున్ బర్త్ డే సీడీపీ..!!

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>