PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yadadri-has-got-a-new-charm-do-you-know-what-is-special-e62e8ec1-b207-470f-9ae2-3cd9b0dab622-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yadadri-has-got-a-new-charm-do-you-know-what-is-special-e62e8ec1-b207-470f-9ae2-3cd9b0dab622-415x250-IndiaHerald.jpgయాదాద్రి నూత‌న ఆల‌యం ప్రారంభోత్స‌వానికి ముహూర్తం తేదీల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. దాదాపుగా వ‌చ్చేనెల‌లోనే ఆల‌య ప్రారంభోత్స‌వానికి సంబంధించిన పూజ‌లు ఉంటాయ‌ని ఆల‌య వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. వచ్చే నెల 14వ తేదీన అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకుని హోమాలు, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై వేద పండితులతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. అక్షయ తృతీయ రోజున సుదర్శన హోమంతో మొదలయ్యే ప్రత్యేక పూజలు వరుసగyadadri;kcr;darshana;chief minister;aqua;yadadri;allagadda;pangaయాదాద్రి నూత‌న ఆల‌యం ప్రారంభోత్స‌వానికి ముహూర్తం ఫిక్స్‌...యాదాద్రి నూత‌న ఆల‌యం ప్రారంభోత్స‌వానికి ముహూర్తం ఫిక్స్‌...yadadri;kcr;darshana;chief minister;aqua;yadadri;allagadda;pangaTue, 06 Apr 2021 08:08:24 GMTయాదాద్రి నూత‌న ఆల‌యం ప్రారంభోత్స‌వానికి ముహూర్తం తేదీల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. దాదాపుగా వ‌చ్చేనెల‌లోనే ఆల‌య ప్రారంభోత్స‌వానికి సంబంధించిన పూజ‌లు ఉంటాయ‌ని ఆల‌య వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. వచ్చే నెల 14వ తేదీన అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకుని హోమాలు, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై వేద పండితులతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. అక్షయ తృతీయ రోజున సుదర్శన హోమంతో మొదలయ్యే ప్రత్యేక పూజలు వరుసగా ఎనిమిది రోజుల పాటు నిర్వహించి తొమ్మిదో రోజున ఉత్సవ మూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన చేయడానికి నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.


అయితే చిన జీయర్ తీసుకునే నిర్ణయం ఆధారంగా యాదాద్రి ఆలయానికి సంబంధించి సీఎం కేసీఆర్ తుది ప్రకటన చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసిన కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి  చంద్రశేఖరరావు ఆలోచనకు ప్రతిరూపంగా చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి పర్యవేక్షణలో వాస్తుశిల్పులు, స్థపతులు ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.


యాదాద్రి ఆల‌య నిర్మాణానికి దాదాపు 1500 మంది శిల్పులను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలనుంచి సుత్తి, ఉలి, శానం చేతపట్టుకుని విచ్చేశారు. 30మందికి పైగా స్తపతులు, ప్రధాన స్తపతి ఈ వందలాది శిల్పకారులచేత అహరహం శిలలపై శిల్పాలు చెక్కించారు. శిల్పశాస్త్రంలో దేవతాశిల్పాలకు ఓ జాతిరాయిని, ఇతర విగ్రహాలను చెక్కేందుకు మరో జాతి శిల్పాలను ఎంచుకోవాలని ఉంది. యాదాద్రి ఆలయ దేవతామూర్తుల రూపకల్పనకు కృష్ణశిలను ఎంచుకోవడంలో ఆధ్యాత్మిక కోణం అద్భుతంగా ఇమిడిఉంది. ఆ శిల్పాలు ఎక్కడ ఎలా ఉంటే వాస్తుయుక్తమో, చూడచక్కదనమో చెప్పే ఆర్కిటెక్చర్‌ తన వందలాది డ్రాయింగ్‌ల రోల్స్‌తో నర్సింహాద్రి గుట్టనెక్కారు. అద్భుత శిల్పసంపదను నర్సింహాద్రి గుట్టపై నెలకొల్పారు.





రోజా నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరో కాదు..?

ష‌ర్మిల పార్టీకి స‌భ క‌ష్టాలు... పెరుగుతున్న అనుమానాలు... ఎందుకంటే...?

వైఎస్‌. ష‌ర్మిల పార్టీపై విజ‌య‌మ్మ స్పంద‌న ఇదే

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>